logo

నెలాఖరు వరకే సాగునీటి సరఫరా

పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు.

Published : 25 Apr 2024 06:22 IST

ఉండి ప్రధాన పంటకాలువ

ఉండి, న్యూస్‌టుడే: పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. రబీ సాగు ఆలస్యంగా ప్రారంభం కావడం..ఈ గడువులోపు కాలువల శివారు, మెరక భూముల్లో పంట గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో నెలాఖరు వరకూ నీరివ్వాలని రైతులు అధికారులకు విన్నవించారు. ఈ క్రమంలో సరఫరా  కొనసాగించి 3,200 నుంచి 3,400 క్యూసెక్కుల మధ్య నీరందించారు. పది రోజుల నుంచి అన్ని ప్రాంతాల్లో వరికోతలు ప్రారంభం కావడంతో సాగు నీటి అవసరాలు తగ్గుతున్నాయని శివారు ప్రాంతాల రైతులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో మంచినీటి చెరువులను యుద్ధప్రాతిపదికన నూరుశాతం నింపుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు. డెల్టా పరిధిలో కాలువలకు బుధవారం 3,100 క్యూసెక్కుల నీరొదిలారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని