logo

కడప మీదుగా ప్రత్యేక రైలు

కడప మీదుగా కాచిగూడ - కొచివేలి(త్రివేండ్రం)- కాచిగూడ ప్రత్యేక రైలు (07229 / 07230) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టరు ఎ.జనార్దన్‌ తెలిపారు.

Published : 17 Apr 2024 05:29 IST

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : కడప మీదుగా కాచిగూడ - కొచివేలి(త్రివేండ్రం)- కాచిగూడ ప్రత్యేక రైలు (07229 / 07230) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టరు ఎ.జనార్దన్‌ తెలిపారు. కాచిగూడ నుంచి ఈ నెల 18, 25 తేదీల్లో (గురువారం) ఉదయం 6.05 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూలు, డోన్‌, గుత్తి మీదుగా ఎర్రగుంట్లకు మధ్యాహ్నం 1.50కు, కడపకు 2.25కు చేరుకుంటుంది. అనంతరం రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈ-రోడ్‌, కోయంబత్తూరు, ఎర్నాకులం టౌన్‌, కొట్టాయం, చెంగనూరు, కొల్లాం మీదుగా కొచివేలికి శుక్రవారం ఉదయం 10.05 వెళుతుంది. తిరుగు ప్రయాణంలో కొచివేలిలో ఈ నెల 19, 26 తేదీల్లో(శుక్రవారం) మధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 6.25 గంటలకు కడప, ఎర్రగుంట్లకు 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు