logo

రామాలయం... పుష్పసోయగం

ఒంటిమిట్ట కోదండ రామాలయం నవమి శోభతో అలరాలుతోంది. ఈ దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తితిదే ఉద్యాన శాఖ విభాగం అధికారులు కడప, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై ప్రాంతాల నుంచి రంగు రంగుల పూలను సుమారు రెండు టన్నులను కొనుగోలు చేశారు.

Published : 17 Apr 2024 05:36 IST

బలిపీఠం, ధ్వజస్తంభం వద్ద పూలతో అలంకరణ

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయం నవమి శోభతో అలరాలుతోంది. ఈ దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తితిదే ఉద్యాన శాఖ విభాగం అధికారులు కడప, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై ప్రాంతాల నుంచి రంగు రంగుల పూలను సుమారు రెండు టన్నులను కొనుగోలు చేశారు. తూర్పు గోపురం, బలిపీఠం, ధ్వజస్తంభం, ముఖ మండపం, అంతరాలయం ద్వారాలను అలంకించారు. రంగ మండపంలో ఎటుచూసినా పుష్పాలంకరణ కనువిందు చేస్తోంది. 

'రంగ మండపంలో పుష్ప శోభితం

బ్రహ్మోత్సవాల్లో నేడు: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం ఉదయం 3 నుంచి 3.30 గంటల వరకు సుప్రభాత సేవ, 3.30 నుంచి 4 గంటలకు ఆలయశుద్ధి, ఉదయం 4 నుంచి 7 గంటల వరకు వరకు సర్వదర్శనం ఉంటుంది. ఆ తర్వాత 7-7.30 వరకూ శుద్ధి, తొలి నైవేద్యం సమర్పణతో దర్శన విరామం, 7.30 నుంచి 11 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య మిథునలగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 11.30 నుంచి సాయంత్రం 5 వరకు, ఆ తర్వాత 5.30 నుంచి 10 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం నిర్వహిస్తారు. రాత్రి 7-9 గంటల వరకు శేష వాహనంపై గ్రామ పురవీధుల్లో శ్రీరామచంద్రుడు విహరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు