logo

బాధిత కుటుంబానికి రూ.50 లక్షలివ్వాలని ఆందోళన

Published : 17 Apr 2024 05:37 IST

విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణకు డిమాండు

పోలీసులు, కళాశాల యాజమాన్యంతో విద్యార్థి సంఘాల నాయకుల వాగ్వాదం

రాజంపేట, న్యూస్‌టుడే: అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలోని వసతిగృహం గదిలో విద్యార్థిని రీను ఉరేసుకుని మృతి చెందిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు మంగళవారం ఆందోళనకు దిగాయి. స్థానిక కళాశాల ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు  ప్రయత్నించిన పీడీఎస్‌యూ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, ఎఫ్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ, జీఆర్‌ఎస్‌ఎఫ్‌ సంఘాల నాయకులను గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కళాశాల యాజమాన్య నిర్లక్ష్యంతోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. పోలీసులు సమగ్రంగా విచారణ జరిపించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్‌, ఏబీవీపీ నాయకుడు మల్లికార్జున డిమాండు చేశారు. వెంటనే ఏఐటీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌ చొప్పా ఎల్లారెడ్డి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌ఎంవీ నారాయణ అక్కడి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై యాజమాన్యంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వైస్‌ ఛైర్మన్‌ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు