logo

AndhraPradesh News: ఆయన బడికొచ్చి రెండేళ్లు.. 80 మంది విద్యార్థుల ఆవేదన

ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా రెండేళ్లగా ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు రావడం లేదు. ఉన్న ఒక్క గురువూ బడికి రాకపోవడంతో రెండేళ్లగా సుమారు 80 విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఫలితంగా విద్యార్థుల

Updated : 01 Feb 2022 09:44 IST

ఉపాధ్యాయుడి గైర్హాజరుతోచదువుకు దూరం

పాఠశాల వద్ద పిల్లలతో తల్లిదండ్రులు

ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా రెండేళ్లగా ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు రావడం లేదు. ఉన్న ఒక్క గురువూ బడికి రాకపోవడంతో రెండేళ్లగా సుమారు 80 విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. గూడెంకొత్తవీధి మండలం మావోయిస్టు ప్రభావిత గాలికొండ పంచాయతీ బత్తునూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రెండేళ్లగా విధులకు హాజరుకావడం లేదు. 2020 మార్చిలో కరోనా లాక్‌డౌన్‌ నుంచి నేటి వరకూ ఆయన రావడంలేదు. తమది మారుమూల ప్రాంతం కావడంతో అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదని, దీంతో తమ పిల్లలు చదువులకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేస్తామని భాజపా మండల అధ్యక్షుడు చల్లంగి అచ్యుత్‌ తెలిపారు.

- సీలేరు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని