icon icon icon
icon icon icon

Chandrababu: శవరాజకీయాల కోసం జగన్‌ పేదలను బలితీసుకున్నారు: చంద్రబాబు

వైకాపా నేతలు కాకినాడను గంజాయి సిటీగా మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 04 May 2024 22:41 IST

కాకినాడ: వైకాపా నేతలు కాకినాడను గంజాయి సిటీగా మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. జూదం ఆడించే ఎమ్మెల్యే మనకు అవసరమా? అని కాకినాడ ఎన్నికల ప్రచారసభలో ప్రజలను ప్రశ్నించారు. శవరాజకీయాల కోసం జగన్‌ పేదలను బలితీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములపై జగన్‌ పెత్తనమేంటని ప్రశ్నించారు. జగన్‌ ఫొటోతో ఉన్న పట్టాదారు పాస్‌బుక్‌ను చించేసిన చంద్రబాబు.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఫొటోలతోనే కొత్త పాస్‌బుక్‌లు ఇస్తామని ప్రకటించారు. జగన్‌ తెచ్చింది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కాదు.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం అని విమర్శించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తానని చేస్తానని హామీ ఇచ్చారు.

‘‘ప్రజల కోసం తెదేపా, జనసేన, భాజపా త్యాగం చేశాయి. రాష్ట్రానికి రూ.13లక్షల కోట్ల అప్పు ఉంది. వైకాపా హయాంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. కూటమిది ప్రజా మేనిఫెస్టో.. జగన్‌వి నకిలీ నవరత్నాలు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్‌. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే జగ్గుభాయ్‌ బ్రాండ్స్‌ మద్యం ఉండదు. మహిళలకు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై పెడతాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img