icon icon icon
icon icon icon

పెమ్మసాని కుటుంబ ఆస్తుల విలువ రూ. 5,705 కోట్లు

గుంటూరు లోక్‌సభ స్థానానికి ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న తెదేపా నేత డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారు.

Updated : 23 Apr 2024 07:07 IST

గుంటూరు ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నామినేషన్‌
దేశంలో సంపన్న రాజకీయ నేతల్లో ఒకరిగా గుర్తింపు

ఈనాడు-అమరావతి : గుంటూరు లోక్‌సభ స్థానానికి ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న తెదేపా నేత డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారు. సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 5,705 కోట్లు, అప్పులు రూ. 1,038 కోట్లుగా అఫిడవిట్‌లో చూపారు. అమెరికాలో వ్యాపారం చేసే ఆయన ఆస్తుల విలువ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వ్యక్తిగత ఆస్తుల ప్రకారం చూస్తే.. ఇతర నేతల కంటే తక్కువే.

  • చంద్రశేఖర్‌ పేరుతో రూ. 2,316 కోట్లు, ఆయన భార్య శ్రీరత్న పేరుతో రూ. 2,289 కోట్లు, పిల్లల పేరుతో రూ. 992 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. బెంజ్‌, టెస్లా, రోల్స్‌రాయిస్‌, టయోటా ఫార్చ్యూనర్‌ కార్లు ఉన్నాయి.

అమెరికాలో వివిధ రంగాల్లో రాణిస్తూ

రెండు దశాబ్దాల కిందట వైద్య విద్యలో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు అమెరికాకు వెళ్లిన పెమ్మసాని చంద్రశేఖర్‌ అక్కడ వైద్యవృత్తికి సంబంధించిన ఆన్‌లైన్‌ శిక్షణ కోర్సుతో వ్యాపారం ప్రారంభించి అందులో విజయం సాధించారు. అక్కడే యు వరల్డ్‌ అనే సంస్థను స్థాపించి వైద్య విద్య, నర్సింగ్‌, హైస్కూలు, గ్రాడ్యుయేషన్‌, అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, లీగల్‌, ఫార్మసీ రంగాల్లో సేవలు అందిస్తున్నారు.

డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆస్తులు ఇలా...

  • నగదు: రూ. 2.06 లక్షలు
  • బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు: రూ. 5.97 కోట్లు  
  • పబ్లిక్‌, ప్రైవేటు కంపెనీలో షేర్ల విలువ: రూ. 2,281 కోట్లు
  • బీమా ప్రీమియం: రూ. 12 కోట్లు  
  • ఇతరులకు అప్పులు ఇచ్చినవి: రూ. 16.6 కోట్లు  
  • కార్ల విలువ: రూ. 6.11 కోట్లు  
  • బంగారం విలువ: రూ. 11.61 లక్షలు  
  • స్థలాలు, ఇల్లు, వ్యవసాయ, వ్యవసాయేతర భూమి: రూ. 72 కోట్లు  ్య అప్పులు: రూ. 519 కోట్లు  

చంద్రశేఖర్‌ భార్య డాక్టర్‌ శ్రీరత్న ఆస్తులివి...

  • నగదు: రూ. 1,51,800
  • బ్యాంకు ఖాతాలో నిల్వలు: రూ. 5.90 కోట్లు
  • పబ్లిక్‌, ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో షేర్లు: రూ. 2,281 కోట్లు
  • బీమా ప్రీమియం: రూ. 6.63 కోట్లు  
  • బంగారం, వెండి విలువ: రూ. 1.84 కోట్లు
  • కృష్ణా జిల్లాలో పెద్దలు ఇచ్చిన వ్యవసాయభూమి: 5.53 ఎకరాలు. విలువ: రూ. 2.33 కోట్లు  
  • స్థలాలు, ఇల్లు, వ్యవసాయేతర భూమి విలువ:  32.48 కోట్లు  
  • అప్పులు: రూ. 519 కోట్లు
  • కుమారుడు అభినవ్‌ పెమ్మసాని పేరిట రూ. 495.50 కోట్లు
  • కుమార్తె సహస్ర పెమ్మసాని పేరిట: రూ. 495.50 కోట్లు
  • కుటుంబ సభ్యుల అప్పు రూ 1,038 కోట్లు

సంపన్నుల్లో మరికొందరు

  • 2022లో తెలంగాణకు చెందిన భారాస రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ. 5,300 కోట్లుగా పేర్కొన్నారు.  
  • తెలంగాణలో భాజపా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ ఆస్తులు రూ. 4,568 కోట్లుగా చూపారు.
  • బిహార్‌ ఎంపీ మహేంద్ర ప్రసాద్‌ ఆస్తుల విలువ రూ.4,078 కోట్లు.
  • ఏపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి 2020లో కుటుంబ ఆస్తుల విలువ రూ. 2,577 కోట్లుగా తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img