icon icon icon
icon icon icon

వైకాపా ఎమ్మెల్సీ భరత్‌ భార్యకు కోడ్‌ వర్తించదా?

కుప్పంలో తన భర్త తరఫున నామినేషన్‌ వేయడానికి ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేస్తూ వైకాపా ఎమ్మెల్సీ భరత్‌ భార్య రెండు కార్లతో ఆర్వో కార్యాలయంలోకి వెళ్లినా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు.

Published : 23 Apr 2024 06:43 IST

తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కుప్పంలో తన భర్త తరఫున నామినేషన్‌ వేయడానికి ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేస్తూ వైకాపా ఎమ్మెల్సీ భరత్‌ భార్య రెండు కార్లతో ఆర్వో కార్యాలయంలోకి వెళ్లినా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు 100 మీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి లోనికి వెళ్లారని గుర్తుచేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎన్నికల కోడ్‌ను వైకాపా నేతలు ఉల్లంఘిస్తున్నా.. అక్కడున్న పోలీసులు వారికి స్వాగతం పలికారు. జగన్‌కు అనుకూలంగా పనిచేసే అధికారులంతా మూల్యం చెల్లించుకోక తప్పదు. కార్లు ఆర్వో కార్యాలయంలోకి రావడంపై విధుల్లో ఉన్న అధికారులు, ఆర్వో, కలెక్టర్‌ సమాధానం చెప్పాలి. ఈ ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం’ అని అశోక్‌బాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img