icon icon icon
icon icon icon

మే 1 నుంచి ఇంటి వద్దే పింఛన్లు అందించాలి

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు మే ఒకటో తేదీ నుంచి ఇళ్ల వద్దే పింఛన్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాను ఎన్డీయే నేతలు కోరారు.

Published : 24 Apr 2024 06:08 IST

సీఈఓకు ఎన్డీయే నేతల వినతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు మే ఒకటో తేదీ నుంచి ఇళ్ల వద్దే పింఛన్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాను ఎన్డీయే నేతలు కోరారు. సచివాలయాల వద్ద పింఛన్లు తీసుకోవాలనే నిబంధన వల్ల ఏప్రిల్‌ నెలలో 31 మంది వృద్ధులు మరణించారని గుర్తుచేశారు. మే నెలలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, భాజపా నేత ఆర్డీ విల్సన్‌, జనసేన నేత శివశంకర్‌లు మంగళవారం సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపాకు చెందిన రామాల మన్విత్‌ కృష్ణారెడ్డి తెదేపా లోగో, చంద్రబాబు ఫొటో పెట్టుకొని.. తెదేపాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో విద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. గతంలో ఆయనపై సీఐడీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img