icon icon icon
icon icon icon

ఎంపీ నందిగం సురేష్‌పై వాలంటీర్‌ పోటీ

ఎక్కడో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సామాన్య జీవితం గడుపుతున్న నందిగం సురేష్‌ గత ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ స్థానానికి వైకాపా తరఫున పోటీచేసి విజయం సాధించి రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని చీరాలకు చెందిన మాజీ వాలంటీర్‌ కట్టా ఆనంద్‌బాబు ప్రశ్నించారు.

Published : 24 Apr 2024 06:09 IST

బాపట్ల, న్యూస్‌టుడే: ఎక్కడో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సామాన్య జీవితం గడుపుతున్న నందిగం సురేష్‌ గత ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ స్థానానికి వైకాపా తరఫున పోటీచేసి విజయం సాధించి రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని చీరాలకు చెందిన మాజీ వాలంటీర్‌ కట్టా ఆనంద్‌బాబు ప్రశ్నించారు. బాపట్లలో కలెక్టరేటర్‌ వద్ద ఆయన మంగళవారం మాట్లాడుతూ బాపట్ల ఎంపీగా గెలిచిన నందిగం సురేష్‌ గత అయిదేళ్లలో ప్రజలకు కనిపించకుండా, వారి సమస్యలు పట్టించుకోకుండా అక్రమార్జనే ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు. అద్దంకికి చెందిన ఓ బాలింత సీఎం సహాయనిధి కోసం ఉద్దండరాయునిపాలెం వెళ్లి ఎంపీ ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నందిగం సురేష్‌ అక్రమాలకు వ్యతిరేకంగా వాలంటీర్‌ పదవికి రాజీనామా చేసి, బాపట్ల లోక్‌సభ వైకాపా రెబల్‌ అభ్యర్థిగా పోటీకి దిగినట్లు తెలిపారు. అనంతరం ఆర్వోకు నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img