icon icon icon
icon icon icon

వైకాపా నాయకుల దాడిలో గాయపడ్డ వారికి అండగా ఉంటాం

చిత్తూరు జిల్లాలో వైకాపా నాయకులు అదే పార్టీకి చెందిన యువకులు, మహిళలపై దాడి చేసి, అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తనను కలిచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 24 Apr 2024 06:11 IST

బాధిత కుటుంబాలను  పరామర్శించిన భువనేశ్వరి

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లాలో వైకాపా నాయకులు అదే పార్టీకి చెందిన యువకులు, మహిళలపై దాడి చేసి, అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తనను కలిచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం పురపాలిక పరిధిలోని తంబిగానిపల్లెలో సోమవారం వైకాపా నాయకుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను మంగళవారం ఆమె వీడియో కాల్‌ ద్వారా పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటి పర్యంతమై వివరాలు భువనేశ్వరికి వెల్లడించారు. ద్విచక్ర వాహన ప్రమాదం నేపథ్యంలో కొత్తపేటకు చెందిన 50 మంది గ్రామంలోకి ప్రవేశించి, యువకులపై దాడి చేశారన్నారు. కర్రలు, రాళ్లతో కొడుతూ, అడ్డుకున్న మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన శరవణ, మణిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇంకా ఇంటికి పంపలేదని వాపోయారు. పట్టపగలు ఈ దాష్టీకం జరుగుతున్నా.. ఎవరూ అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భువనేశ్వరి స్పందిస్తూ.. వైకాపా జెండాలు పట్టుకుని రాడ్లు, కర్రలతో దాడి చేయడం దారుణమన్నారు. ప్రశాంతతకు నిలయమైన కుప్పంలో ఇలాంటి ఘటన జరగడం తగదన్నారు. బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు తరఫున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ అందుబాటులో ఉంటారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img