icon icon icon
icon icon icon

గూగుల్‌లో చెక్‌ చేస్తే జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు బహిర్గతం

సీఎం జగన్‌ ఎంత గొప్ప పారిశ్రామికవేత్తో తెలుసుకుందామని గూగుల్‌లో కొడితే ఆయనపై సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు, ఛార్జిషీట్లు వచ్చాయని తెదేపా అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ఎద్దేవా చేశారు.

Published : 25 Apr 2024 06:04 IST

తెదేపా అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌ ఎంత గొప్ప పారిశ్రామికవేత్తో తెలుసుకుందామని గూగుల్‌లో కొడితే ఆయనపై సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు, ఛార్జిషీట్లు వచ్చాయని తెదేపా అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ఎద్దేవా చేశారు. ‘మీరు రాజకీయ నేత కాకముందు మంచి పారిశ్రామికవేత్త.. ఇవన్నీ ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారు?’ అని వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తల సమావేశంలో ఓ యువతి అడిగిన ప్రశ్నకు జగన్‌ సమాధానం చెప్పకపోవడం.. సజ్జల భార్గవరెడ్డి జోక్యం చేసుకొని ఇంటర్నెట్‌లో చూడాలని చెప్పడాన్ని జ్యోత్స్న ప్రస్తావించారు. ఆమె ఇంగ్లిష్‌లో అడిగిన ప్రశ్న అర్థంకాకే జగన్‌ పిచ్చిచూపులు చూస్తూ కూర్చుండిపోయారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘ఇంటర్నెట్‌లో జగన్‌ గురించి వెతికితే.. ఆయన పెట్టిన షెల్‌ కంపెనీలు, 2004 తర్వాత విపరీతంగా పెరిగిన ఆస్తులు వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన 64 షెల్‌ కంపెనీలు పెట్టినట్టు తెలిసింది’ అని జ్యోత్స్న ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img