icon icon icon
icon icon icon

సందిగ్ధతతో ఓటును చెల్లని కాగితంగా చేయొద్దు..!

పోస్టల్‌ బ్యాలట్‌ వేయడంలో కొంతమంది ఉద్యోగులు చేస్తున్న తప్పుల కారణంగా ఓట్లు చెల్లనివిగా మారుతున్నాయి. ఓటు వేయడంలో సందేహాలు ఉంటే అక్కడే ఉండే పీఓ, ఏపీఓల సహాయం సైతం తీసుకోవచ్చు.

Published : 05 May 2024 06:43 IST

పోస్టల్‌ బ్యాలట్‌లో కొందరు ఉద్యోగుల తప్పులు

ఈనాడు, అమరావతి: పోస్టల్‌ బ్యాలట్‌ వేయడంలో కొంతమంది ఉద్యోగులు చేస్తున్న తప్పుల కారణంగా ఓట్లు చెల్లనివిగా మారుతున్నాయి. ఓటు వేయడంలో సందేహాలు ఉంటే అక్కడే ఉండే పీఓ, ఏపీఓల సహాయం సైతం తీసుకోవచ్చు.

  • లోక్‌సభ, శాసనసభకు రెండు వేర్వేరు సెట్లు ఉంటాయి. ఒక్కోదానికి మూడు ఫామ్‌లు ఇస్తారు. ః ఫామ్‌-13ఏ: లోక్‌సభ అయితే ఆ బ్యాలట్‌ పేపర్‌ సీరియల్‌ నంబరు.. శాసనసభకు అయితే దాని సీరియల్‌ నంబరు తప్పనిసరిగా రాసి, మిగిలిన వివరాలు పూరించాలి. ఉద్యోగి సంతకం చేసి, గెజిటెడ్‌ అధికారి చేత సంతకం చేయించాలి. చేతిలోని బ్యాలట్‌ పేపర్‌పై అభ్యర్థికి ఎదురుగా టిక్‌ చేయాలి.
  • ఫామ్‌-13బీ: చిన్న కవర్‌. బ్యాలట్‌ పేపర్‌ సీరియల్‌ నంబరు తప్పనిసరిగా రాసి, కవర్‌ లోపల ఓటు వేసిన బ్యాలట్‌ పేపర్‌ ఉంచి సీల్‌ చేయాలి.ః ఫామ్‌-13సీ: ఇది పెద్ద కవరు. దీనిపై ఉద్యోగి తప్పనిసరిగా సంతకం చేసి, మిగిలిన అన్ని వివరాలూ పూరించాలి. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గం పేరు రాయాలి. ఫామ్‌-13ఏ, సీల్‌ చేసిన ఫామ్‌-13బీ ఈ కవర్‌లో ఉంచి సీల్‌ చేయాలి. లోక్‌సభకు సంబంధించిన కవర్‌ను దాని బాక్సులో.. శాసనసభకు సంబంధించిన కవర్‌ను దాని బాక్సులో వేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img