icon icon icon
icon icon icon

జగన్‌ గెలిస్తే ప్రజల భూములన్నీ తాకట్టే!

కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ద్వారా ప్రజల భూముల్ని తాకట్టు పెట్టడానికి జగన్‌ కుట్ర పన్నినట్లు తెదేపా నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.

Published : 05 May 2024 06:44 IST

‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో నందమూరి బాలకృష్ణ

ఎలమంచిలి, అచ్యుతాపురం, న్యూస్‌టుడే: కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ద్వారా ప్రజల భూముల్ని తాకట్టు పెట్టడానికి జగన్‌ కుట్ర పన్నినట్లు తెదేపా నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. నకళ్లు హక్కుదారులకు ఇచ్చి అసలు పత్రాలు జగన్‌ వద్దే ఉంచుకుంటారని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో విధ్వంస పాలనకు చిరునామాగా మారిన జగన్‌ మరోసారి గెలిస్తే పీల్చే గాలిపైనా పన్ను వేసి పీడిస్తారని ఎద్దేవా చేశారు. రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్‌ కేవలం రూ.1.7 లక్షల కోట్లు ప్రజలకు పంపిణీ చేశారని, మిగిలిన డబ్బులు ఎక్కడ ఉన్నాయో నిలదీయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు తెదేపా ప్రభుత్వం రూ.75 వేల కోట్ల రుణాలు కేటాయిస్తే, ప్రస్తుత సర్కారు ఆ నిధులన్నీ ఖాళీ చేసిందన్నారు. గత అయిదేళ్లలో ఆ పార్టీ నేతలు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెదేపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయిస్తామని, ఆంధ్రుల హక్కును వదులుకోబోమని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img