icon icon icon
icon icon icon

ఎన్నారైల ఆత్మగౌరవాన్ని వైకాపా దెబ్బతీస్తోంది

సీఎంఆర్‌ఎఫ్‌(ముఖ్యమంత్రి సహాయనిధి) ద్వారా వైకాపా ప్రభుత్వం చేసిన సాయం కంటే ఎన్నారైలుగా తాము అయిదు రెట్లు ఎక్కువ చేశామని తెదేపా ఎన్నారై నేతలు తెలిపారు.

Published : 25 Apr 2024 06:27 IST

తీవ్రంగా ఖండించిన తెదేపా ఎన్నారై విభాగం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎంఆర్‌ఎఫ్‌(ముఖ్యమంత్రి సహాయనిధి) ద్వారా వైకాపా ప్రభుత్వం చేసిన సాయం కంటే ఎన్నారైలుగా తాము అయిదు రెట్లు ఎక్కువ చేశామని తెదేపా ఎన్నారై నేతలు తెలిపారు. దేశ ప్రగతికి తమవంతు కృషి చేస్తున్న ఎన్నారైల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సాక్షి పత్రిక సహా.. సామాజిక మాధ్యమాల్లో వైకాపా నాయకులు దుష్ప్రచారం చేయడం దారుణమని వాపోయారు. ‘గుంటనక్కాల్లా గ్రామాల్లోకి వచ్చారు’ అంటూ సాక్షి పత్రికలో ప్రచురించిన కథనాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ నాయకుల దిగజారుడుతనానికి ఈ రాతలు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఎన్నారై తెదేపా నేతలు సాయి, సతీష్‌, నాగమల్లేశ్వరరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ‘అబద్ధం ప్లస్‌ బుదర ఇక్వెల్‌ టు వైకాపా. కొవిడ్‌ సహా అనేక విపత్తుల్లో ఎన్నారైలుగా మా వంతు సేవ చేశాం. ఆస్ట్రేలియా, యూరప్‌ సహా వివిధ దేశాల్లో తెలుగువారికి ఏ కష్టమొచ్చినా అండగా నిలిచాం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అనేక దేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తాం. మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైకాపా నాయకులు వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని సాయి డిమాండ్‌ చేశారు. ఎన్నారైలపై అనుచిత వ్యాఖ్యల్ని పార్టీల కతీతంగా అందరూ ఖండించాలని సతీష్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img