icon icon icon
icon icon icon

పింఛన్ల పంపిణీకి నిధులివ్వని సీఎం

ఒకటో తారీఖున పింఛను ఇవ్వాల్సి వస్తుందని తెలిసినా..  సరిపడా నిధులివ్వకుండా వృద్ధుల్ని సచివాలయాల దగ్గర బారులు తీరేలా చేసింది సీఎం జగనేనని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Published : 27 Apr 2024 05:46 IST

32మంది మరణాలకు జగనే కారణం: లోకేశ్‌

ఈనాడు, అమరావతి: ఒకటో తారీఖున పింఛను ఇవ్వాల్సి వస్తుందని తెలిసినా..  సరిపడా నిధులివ్వకుండా వృద్ధుల్ని సచివాలయాల దగ్గర బారులు తీరేలా చేసింది సీఎం జగనేనని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘ప్రతి గడపకు వెళ్లి పింఛను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైతే అధికారులందరినీ పంపిణీకి పంపమని ఎన్నికల సంఘాన్ని కోరాం’ అని వివరించారు. కృష్ణాయపాలెంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘పింఛన్లకు పూర్తిస్థాయిలో నిధులివ్వకుండా.. ఒక్కో సచివాలయానికి 9నుంచి 10శాతమే మాత్రమే అందజేశారు. ఇది తెలియక వృద్ధులంతా పింఛన్ల కోసం బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 32మంది చనిపోయారు’ అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఆ అవ్వతాతల మరణాలను తనకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జగన్‌ శవరాజకీయం చేస్తున్నారు. పింఛను రూ.4వేలు చేసే బాధ్యతను ఏర్పడబోయే కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని.. వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img