icon icon icon
icon icon icon

తిరుపతి అసెంబ్లీ స్థానం.. పేర్లు గందరగోళం

తిరుపతి శాసనసభ స్థానానికి జాతీయ జనసేన పార్టీ తరఫున దాఖలైన నామినేషన్‌ కాక రేపుతోంది. ఇక్కడి నుంచి ఎన్డీయే అభ్యర్థిగా జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు నామినేషన్‌ దాఖలు చేయగా.. జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా అల్లూరి శ్రీనివాసులు నామినేషన్‌ వేశారు.

Published : 27 Apr 2024 05:52 IST

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి శాసనసభ స్థానానికి జాతీయ జనసేన పార్టీ తరఫున దాఖలైన నామినేషన్‌ కాక రేపుతోంది. ఇక్కడి నుంచి ఎన్డీయే అభ్యర్థిగా జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు నామినేషన్‌ దాఖలు చేయగా.. జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా అల్లూరి శ్రీనివాసులు నామినేషన్‌ వేశారు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు కాగా.. దాదాపు అదే పోలికలతో ఉన్న బకెట్‌ గుర్తు జాతీయ జనసేన పార్టీది కావడం విశేషం. పార్టీ పేరు, గుర్తు, అభ్యర్థి పేరు దాదాపుగా ఒకేలా ఉండటంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img