icon icon icon
icon icon icon

ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన షర్మిల

పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అరగంట సేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ప్రభుత్వంపైనా, పోలీసుల తీరుపైనా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 27 Apr 2024 05:55 IST

పట్టించుకోని పోలీసులు
ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీసీ అధ్యక్షురాలు

దెందులూరు, ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అరగంట సేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ప్రభుత్వంపైనా, పోలీసుల తీరుపైనా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలో శుక్రవారం రాత్రి రోడ్‌షో ముగించుకున్న అనంతరం షర్మిల తన వాహనంలో బయలుదేరగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. రోడ్‌షోకు ముందు హడావిడి చేసిన పోలీసులు కార్యక్రమం ముగిశాక కనిపించకుండా పోయారు. జంగారెడ్డిగూడెం వైపు నుంచి ఏలూరు, ఏలూరు నుంచి గోపన్నపాలెం వైపు వచ్చే వాహనాలు ఎదురెదురుగా నిలిచి పోయాయి. మధ్యలో షర్మిల ప్రయాణిస్తున్న వాహనం చిక్కుకుపోయింది. వాహనంలో నుంచి ఆమె మైక్‌లో మాట్లాడారు. ‘పోలీసులు ఏమయ్యారు. ట్రాఫిక్‌ను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారు. అనుమతి తీసుకునే కదా రోడ్‌షో పెట్టాను’ అంటూ ఆవేదన చెందారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఎస్పీకి, ఎన్నికల అధికారులకు షర్మిల ఫోన్‌ చేయగా.. ఎవరూ స్పందించలేదు. చివరకు కలెక్టర్‌కు ఫోన్‌ చేయడంతో ఆయన మాట్లాడారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అరగంట తర్వాత ఆమె వాహనం బయలుదేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img