icon icon icon
icon icon icon

బాధితులందరికీ న్యాయం చేయాలి

వైకాపా నాయకుల దౌర్జన్యాలకు గురైన బాధితులందరికీ న్యాయం చేయాలని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి డిమాండ్‌ చేశారు. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలకు నిరసనగా గుంటూరు స్వర్ణభారతినగర్‌లోని తన నివాసంలో శ్రీలక్ష్మి శనివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

Published : 28 Apr 2024 05:54 IST

ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల దౌర్జన్యాలకు గురైన బాధితులందరికీ న్యాయం చేయాలని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి డిమాండ్‌ చేశారు. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలకు నిరసనగా గుంటూరు స్వర్ణభారతినగర్‌లోని తన నివాసంలో శ్రీలక్ష్మి శనివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైకాపా కార్యకర్తల అరాచకాలతో ఎంతో మందికి అన్యాయం జరిగిందన్నారు. పేదల ఇళ్ల స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి దౌర్జన్యంగా ఆక్రమించి విక్రయించుకున్నారన్నారు. వైకాపా పాలనలో స్వర్ణభారతి నగర్‌, కృష్ణ తులసినగర్‌ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేశామన్నారు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు తారుమారు చేశారన్నారు. వైకాపా నాయకులు యువతను గంజాయికి బానిసలుగా మార్చి వారితో అమాయకులపై దాడులు చేయిస్తున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. న్యాయవాది శైలజ, ఉమ, శ్రీలత, మాధవి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img