icon icon icon
icon icon icon

జగన్‌ ప్రభుత్వ మద్యంలో ప్రాణాంతక రసాయనాలు

గన్‌ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంలో ప్రాణాంతక రసాయనాలు ఉన్నట్లు తేలిందని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆరోపించారు.

Updated : 28 Apr 2024 07:28 IST

అడ్డగోలు అవినీతిపై చర్చకు సిద్ధం
తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: జగన్‌ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంలో ప్రాణాంతక రసాయనాలు ఉన్నట్లు తేలిందని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో శనివారం రోడ్‌షో నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ ‘మద్యం సీసాలను నేను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. పిచ్చిబ్రాండ్ల మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రూ.60కు లభించే మద్యాన్ని రూ.200కు పెంచారు. జగన్‌ ప్రభుత్వం చేసిన అడ్డగోలు అవినీతిపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమే’ అని సవాలు విసిరారు. ‘గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా చేయని దోపిడీ లేదు. ఆయనకు ప్రజల సమస్యల కంటే సొంత సంపాదనపైనే మక్కువ. అసమర్థ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు. యువతకు ఉద్యోగాల్లేవు. వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొంటున్నారు. రూ.5000 ఇచ్చినంత మాత్రాన కడుపు నిండుతుందా’ అనిప్రశ్నించారు. గుంటూరు తూర్పు అభ్యర్థి మహమ్మద్‌ నసీర్‌ మాట్లాడుతూ జగన్‌ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. తెదేపా ప్రభంజనంలో ఫ్యాన్‌ రెక్కలు విరిగిపోవడం ఖాయమని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img