icon icon icon
icon icon icon

అది మ్యానిఫెస్టో కాదు.. జగన్‌ రాజీనామా లేఖ

ఎన్నికలకు ముందే జగన్‌ రాజీనామా లేఖలా వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టో ఉందని తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ పార్టీ అభ్యర్థి నారా లోకేశ్‌ విమర్శించారు.

Published : 28 Apr 2024 06:41 IST

రచ్చబండలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

మంగళగిరి (పెదవడ్లపూడి), న్యూస్‌టుడే: ఎన్నికలకు ముందే జగన్‌ రాజీనామా లేఖలా వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టో ఉందని తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ పార్టీ అభ్యర్థి నారా లోకేశ్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించిన రచ్చబండలో ప్రజా సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛనును అయిదేళ్లలో రూ.500 పెంచుతానని మ్యానిఫెస్టోలో జగన్‌ ప్రకటించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపై ఉంటుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img