icon icon icon
icon icon icon

15 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెదేపా సమన్వయకర్తల నియామకం

శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎన్నికల సమన్వయకర్తగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని పార్టీ నియమించింది.

Published : 30 Apr 2024 05:58 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి : శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎన్నికల సమన్వయకర్తగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని పార్టీ నియమించింది. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని నియమిస్తూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రాలయానికి పాలకుర్తి తిక్కారెడ్డి, వెంకటగిరికి వూకా విజయ్‌కుమార్‌, మదనపల్లికి చమర్తి సురేష్‌రాజు, మడకశిరకు గుండుమల తిప్పేస్వామి, రంపచోడవరానికి వంతల రాజేశ్వరి, ప్రొద్దుటూరుకు చదిపిరాళ్ల శివనాథరెడ్డి, పుంగనూరుకు మన్నె సుబ్బారెడ్డి, నంద్యాలకు ఏరాసు ప్రతాపరెడ్డి, మార్కాపురానికి మాగుంట రాఘవరెడ్డి, పాడేరుకు బుద్దా నాగజగదీష్‌, పాణ్యంకు మల్లెల రాజశేఖర్‌, రాప్తాడుకు గోనుగుంట్ల విజయ్‌కుమార్‌లను ఎన్నికల సమన్వయకర్తలుగా నియమించారు.  చీపురుపల్లికి గద్దె బాబూరావు, కుచ్చర్లపాటి త్రిమూర్తులురాజును, రాజంపేటకు జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చమర్తి జగన్మోహన్‌రాజు, పోలి సుబ్బారెడ్డిని సమన్వయకర్తలుగా నియమించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img