icon icon icon
icon icon icon

ఏపీలో 110కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే గెలవబోతోంది

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయేకు 110కి పైగా అసెంబ్లీ, 18-20 లోక్‌సభ స్థానాలు రానున్నట్లు తమ పార్టీ అంతర్గత సర్వేలో తేలిందని భాజపా మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు.

Published : 01 May 2024 05:59 IST

18-20 లోక్‌సభ సీట్లు వస్తాయ్‌
భాజపా మాజీ ఎంపీ జీవీఎల్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయేకు 110కి పైగా అసెంబ్లీ, 18-20 లోక్‌సభ స్థానాలు రానున్నట్లు తమ పార్టీ అంతర్గత సర్వేలో తేలిందని భాజపా మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. తెలంగాణలో భాజపాకు 9-10 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. మంగళవారం ఆయన ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సారి దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా ప్రభావం బలంగా ఉంటుందని, గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్ల తమ పార్టీకి సానుకూల ఓటు పెరగబోతోందని విశ్లేషించారు. కేజ్రీవాల్‌, కవిత అరెస్ట్‌ అంశం తమకు ఎలాంటి నష్టం చేయబోదన్నారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో ఆప్‌ అవినీతి ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భాజపా 5 లోక్‌సభ, 5 అసెంబ్లీ స్థానాలను గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గాజు గ్లాస్‌ గుర్తు స్వతంత్రులకు కేటాయించడం కొంత గందరగోళంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో మే 6వ తేదీలోపు కూటమి ప్రచారం కోసం కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కూటమి మరింత పుంజుకోవాలంటే మోదీ పేరు ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img