icon icon icon
icon icon icon

అసెంబ్లీకి 2,387 మంది.. లోక్‌సభకు 454 మంది

సార్వత్రిక ఎన్నికల సమరంలో రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో 2,387 మంది, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Updated : 01 May 2024 06:07 IST

నియోజకవర్గాల వారీగా లెక్కతేలిన అభ్యర్థుల సంఖ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో 2,387 మంది, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరగనుండగా, సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 318 మంది, లోక్‌సభ స్థానాల్లో 49 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి అత్యధికంగా 10, బాపట్ల శాసనసభకు 11 మంది నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ఎంకే మీనా మంగళవారం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img