icon icon icon
icon icon icon

పుంగనూరులో కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు పెద్దిరెడ్డి అనుచరులే

పుంగనూరు నియోజకవర్గంలో కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు అందరూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులేనని తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, ఏఎస్‌ రామకృష్ణ, కోడూరి అఖిల్‌ ఆరోపించారు.

Published : 01 May 2024 06:02 IST

సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పుంగనూరు నియోజకవర్గంలో కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు అందరూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులేనని తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, ఏఎస్‌ రామకృష్ణ, కోడూరి అఖిల్‌ ఆరోపించారు. పెద్దిరెడ్డి సామ్రాజ్యంగా మారిన పుంగనూరులో సీఎస్‌, డీజీపీ ఆదేశాలు అమలు కావన్నారు. వైకాపా నాయకులు ప్రతిపక్షాల ప్రచార రథాల్ని తగలబెడుతున్నా, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రాజ్‌భవన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ డీఎస్పీ సుధాకర్‌, ఆయన సోదరుడు పొన్నూరులోని ఓటర్లను బెదిరిస్తున్నారని.. ధార్మిక కార్యక్రమాలు చేయనివ్వకుండా చిత్తూరు ఎన్డీయే అభ్యర్థి జగన్మోహన్‌ను అడ్డుకుంటున్న ఆ నియోజకవర్గ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారిణి(ఏఆర్‌వో) అరుణపై చర్యలు తీసుకోవాలని మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్‌మీనాకు వారు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘పుంగనూరులో రామచంద్రయాదవ్‌పై వైకాపా నాయకులు దాడి చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. అక్కడ సజావుగా ఎన్నికలు జరగాలంటే కేంద్ర బలగాల్ని మోహరించాలి’ అని వర్ల రామయ్య కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img