icon icon icon
icon icon icon

ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు వైకాపా పన్నాగాలు

ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని హిందూపురం తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు.

Published : 01 May 2024 06:38 IST

ఏపీ అప్పుల్లో రూ.10 లక్షల కోట్లు ఏమయ్యాయి
మర్రిపూడి రోడ్‌షోలో ఎమ్మెల్యే బాలకృష్ణ

పొదిలి, మర్రిపూడి, న్యూస్‌టుడే: ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని హిందూపురం తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. ప్రకాశం జిల్లా మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు, వ్యాపారులను ఎన్నోరకాలుగా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కొత్త చట్టాలు తెచ్చి మన ఆస్తి, భూములు మనవి కాకుండా చేసే పన్నాగం పన్నుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వైకాపా చేసిన అప్పు రూ.12 లక్షల కోట్లయితే.. ఖర్చు చేసింది రెండున్నర లక్షల కోట్లేనని.. మిగిలిన రూ.10 లక్షల కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. అవినీతిపరుడైన, కబ్జాదారుడైన మంత్రిని తెచ్చి కొండపి నియోజకవర్గంలో వైకాపా పోటీకి నిలిపిందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాలంటే కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కొండపి నియోజకవర్గం నుంచి తెదేపా కూటమి అభ్యర్థి డాక్టర్‌ డోలా బాలావీరాంజనేయస్వామిని, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img