icon icon icon
icon icon icon

వాలంటీర్లు వైకాపా కండువా వేసుకోకుంటే ఖబడ్దార్‌!

వైకాపా కండువా వేసుకోని వాలంటీర్లు వచ్చే ప్రభుత్వంలో కొనసాగరని శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హెచ్చరించారు.

Published : 02 May 2024 06:13 IST

టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ బెదిరింపులు

టెక్కలి, టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా కండువా వేసుకోని వాలంటీర్లు వచ్చే ప్రభుత్వంలో కొనసాగరని శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ హెచ్చరించారు. టెక్కలిలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన వాలంటీర్లను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ‘కండువా వేసుకోలేదు..రాజీనామా చేయలేదని ఏ వాలంటీరు గురించి రిపోర్టు వచ్చినా వారు రానున్న ప్రభుత్వంలో విధుల్లో ఉండరు. అప్పుడు మీరు చెప్పినా మేం వినం. ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకుని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్లు కచ్చితంగా జూన్‌ అయిదో తేదీ నుంచి కొనసాగుతారు. ఈ రోజు.. లేదంటే రేపు మిగిలిన వాలంటీర్లు రాజీనామా చేయండి. మూడో తేదీ నాటికి ఏ వాలంటీరైనా రాజీనామా చేయలేదని తెలిస్తే మాకు వారు అక్కర్లేదు. వారి స్థానంలో ఇంకొకరు వస్తారు. ఈ పది రోజులు ఎవరైతే మన కోసం పని చేస్తారో వారే మన వాలంటీరు’ అని దువ్వాడ బెదిరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img