icon icon icon
icon icon icon

బుట్టమ్మా.. మాకు తాగునీరు, రోడ్లేవీ?

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకను వివిధ సమస్యలపై రెండు గ్రామాలకు చెందిన ప్రజలు బుధవారం ప్రశ్నించారు.

Published : 02 May 2024 06:14 IST

ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థిని ప్రశ్నించిన స్థానికులు

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకను వివిధ సమస్యలపై రెండు గ్రామాలకు చెందిన ప్రజలు బుధవారం ప్రశ్నించారు. ఎమ్మిగనూరు మండలం టీఎస్‌ కూలూరులో తాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే ఐదేళ్లుగా పట్టించుకోలేదని మండిపడ్డారు. అంతర్గత దారులు లేక తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కె.నాగలాపురం గ్రామస్థులు నిలదీశారు. వైకాపా నాయకుల వీధుల్లో మాత్రమే సీసీ రోడ్లు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img