icon icon icon
icon icon icon

వైకాపా అరాచకాన్ని భూస్థాపితం చేసేందుకే కూటమిగా పోటీ

‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత.. రాష్ట్రంలో అరాచకపాలన ప్రారంభమైంది. ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ప్రశ్నించినవారిపై దాడులు చేశారు.

Published : 02 May 2024 06:17 IST

జగన్‌కు తెలిసింది దోచుకోవడం, దాచుకోవడమే
నెల్లూరు యువగళం సభలో నారా లోకేశ్‌

ఈనాడు, నెల్లూరు: ‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత.. రాష్ట్రంలో అరాచకపాలన ప్రారంభమైంది. ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ప్రశ్నించినవారిపై దాడులు చేశారు. కేసులు పెట్టారు. అందుకే వచ్చే ఎన్నికల్లో జగన్‌రెడ్డి అక్రమాలు, అరాచకాలను భూస్థాపితం చేసేందుకు కూటమిగా జతకట్టాం. ఓట్ల చీలికతో రాష్ట్రం నష్టపోవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని  తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. నెల్లూరులో బుధవారం యువగళం సభలో ఆయన మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వంలో అంతటా విధ్వంసమే కనిపిస్తోంది. అడుగడుగునా కంపెనీలను ఇబ్బంది పెట్టారు. సోలార్‌ ఎనర్జీ పీపీఏలను రద్దు చేశారు. అమరరాజాను పక్క రాష్ట్రానికి పంపేశారు. జగన్‌ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ‘విదేశీ విద్య’ను రద్దు చేసింది. వైకాపా ప్రభుత్వం మెడికల్‌ సీట్లు అమ్మకానికి పెట్టింది, మేం వచ్చాక వైద్య కళాశాలల్లో ఫ్రీ సీట్లు పెంచుతాం’ అని లోకేశ్‌ అన్నారు. రాష్ట్రంలో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందనీ, రూ.5 వేలు ఇచ్చే వాలంటీర్‌ కావాలా? రూ.50 వేలు వచ్చే ఐటీ ఉద్యోగం కావాలో తేల్చుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img