icon icon icon
icon icon icon

జలయజ్ఞం పేరుతో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు

రివర్స్‌ టెండరింగ్‌తో సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేసి, పోలవరాన్ని నట్టేట ముంచిన సీఎం జగన్‌... రాష్ట్రాన్ని ఎడారిలా మార్చారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు.

Published : 04 May 2024 05:36 IST

సీఎం జగన్‌పై ఎన్డీయే నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రివర్స్‌ టెండరింగ్‌తో సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేసి, పోలవరాన్ని నట్టేట ముంచిన సీఎం జగన్‌... రాష్ట్రాన్ని ఎడారిలా మార్చారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులకు సంబంధించి... మిగిలిన పది శాతం పనుల్నీ వైకాపా సర్కారు చేయలేదని దుయ్యబట్టారు. జలయజ్ఞం పేరుతో రూ.20 వేల కోట్లను జగన్‌ కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.68,293 కోట్లు ఖర్చు చేస్తే... వైకాపా ప్రభుత్వం రూ.39,052 కోట్లే వెచ్చించిందని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, భాజపా నేత పాకా సత్యనారాయణ, జనసేన నేత గౌతమ్‌ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా ప్రభుత్వం కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. వంశధార-నాగావళి నదుల అనుసంధానాన్ని గాలికొదిలారు. అవుకు టన్నెల్‌ను పూర్తి చేసి నిర్వాసితుల్ని ఆదుకుంటామని మోసగించారు. కుప్పంలో ఉత్తుత్తి గేట్లు పెట్టి నీళ్లు వదిలినట్లు డ్రామాలాడారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 93,300 చెక్‌ డ్యామ్‌లను నిర్మిస్తే... జగన్‌ ఒక్కటీ కట్టలేదు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు తెదేపా రూ.12,441 కోట్లు ఖర్చు చేస్తే.. వైకాపా ప్రభుత్వం ఇచ్చింది రూ.2 వేల కోట్లే’ అని  ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ అధ్వాన నిర్వహణతో కొట్టుకుపోయిన పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లనూ తిరిగి పెట్టలేక పోయారని పాకా సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img