icon icon icon
icon icon icon

సజ్జల భార్గవ్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి

సామాజిక మాధ్యమాల్లో తెదేపా మహిళా నేతల చిత్రాల్ని అభ్యంతరకరంగా మార్ఫింగ్‌ చేసిన వ్యవహారం వెనక సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఉన్నారని తెదేపా నేతలు ఆరోపించారు.

Published : 08 May 2024 06:19 IST

మహిళల ఫొటో మార్ఫింగ్‌ వ్యవహారంపై సీఈఓకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో తెదేపా మహిళా నేతల చిత్రాల్ని అభ్యంతరకరంగా మార్ఫింగ్‌ చేసిన వ్యవహారం వెనక సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఉన్నారని తెదేపా నేతలు ఆరోపించారు. వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనాకు తెదేపా నేతలు వర్ల రామయ్య, బుచ్చి రాంప్రసాద్‌, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. మహిళల్ని వేధించేలా పోస్టులు రూపొందించిన వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా తొత్తుల్లా వ్యవహరిస్తున్న వేమూరు సీఐ, నలుగురు ఎస్సైల్ని బదిలీ చేయాలి. గురజాల డీఎస్పీ, మాచర్ల సీఐ, కారంపూడి ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలి’ అని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img