icon icon icon
icon icon icon

Pawan Kalyan: తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్‌ కల్యాణ్‌

తిరుమల పవిత్రతను కాపాడుతామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Updated : 07 May 2024 22:10 IST

తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడుతామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. వైకాపా నేతల అక్రమాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి.. అధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను రిసార్ట్‌గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్ట్‌ పేరుతో టికెట్‌ ధరలు పెంచారని, ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోందన్నారు. 

వేంకటేశ్వరస్వామిని అవమానించిన వ్యక్తికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారిని స్వామివారు మట్టిలో కలిపేస్తారని హెచ్చరించారు. తితిదే కాంట్రాక్టు పనుల్లో భూమన .. 10 నుంచి 12శాతం మీషన్‌ తీసుకుంటున్నారని ఆరోపించారు. తితిదే ఉద్యోగుల ఇంటి పట్టాలపై కూడా జగన్‌ బొమ్మేనా?అని ప్రశ్నించారు. ఎంతోమందికి ఉపాధి కల్పించిన అమరరాజా పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోయిందని, కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయన్నారు. ‘‘కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడికి మీరు భయపడతారా? రౌడీ యిజం చేసేవారికి ఎన్నాళ్లు భయపడతాం?కూటమి ప్రభుత్వం వస్తేనే వైకాపా నేతల ఆగడాలు ఆగుతాయి. ఎన్నికల్లో కరుణాకర్‌రెడ్డి పంపిణీ చేసే డబ్బులు తీసుకుని స్వామి వారి హుండీలో వేసేయండి. ధర్మం గెలుస్తుంది.. కూటమి ప్రభుత్వం వస్తుంది. కూటమిదే పీఠం’’ అని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img