Cave man: గుహలో 16 ఏళ్లు ఒంటరి జీవితం.. సంతోషం కోసం వింత నిర్ణయం!
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి చిల్లిగవ్వ కూడా లేకుండా 16 ఏళ్లు ఒంటరిగా గుహలో జీవనం సాగించాడు.
(Image : Only Human)
డబ్బుకు లోకం దాసోహం అంటారు. ఆధునిక ప్రపంచం మొత్తం డబ్బు(Money) చుట్టూ తిరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదిస్తూ వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నారు. అలా ఖర్చు చేసే మొత్తంలో మెజారిటీ వాటా చాలా మంది ఇంటి అద్దె చెల్లించడానికే (house rent)వెచ్చిస్తున్నారు. ఈ విధానంపై ఓ వ్యక్తికి విసుగుపుట్టింది. అంతే.. డబ్బు, ఇల్లు లేకుండా ఓ గుహలో 16ఏళ్లు జీవనం సాగించాడు. అదెలా సాధ్యమైందో తెలుసుకుందాం పదండి..
అన్నీ త్యజించి..
అమెరికాకు(america) చెందిన డేనియల్ షెల్లాబార్జర్ అలియాస్ స్వీలో అందరిలాగే సాధారణ జీవితం గడిపేవాడు. అతడికి కష్టపడి సంపాదించడం.. అలా వచ్చిన నగదుతో ఇంటి అద్దె కట్టడం నచ్చలేదు. దాంతో ఓ రోజు తాను చేస్తున్న ఉద్యోగం, అద్దె ఇల్లు వదిలి ఓ గుహ(cave)లోకి వెళ్లాలనుకొని నిశ్చయించుకొన్నాడు. ఆ సమయంలో డేనియల్ దగ్గర కొంత డబ్బు ఉండేది. వెంటనే దాన్ని తీసుకెళ్లి ఓ పబ్లిక్ ఫోన్ బాక్స్‌పై పెట్టి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. అలా వెళ్తున్నప్పుడు తనకు స్వేచ్ఛ లభించినట్లయింది. సౌకర్యంగా అనిపించింది. విలువైనది వదిలేసి వెళ్తున్నట్లు కాకుండా ఓ గుది బండను వదిలించుకున్నట్లుగా తన మనసుకు ప్రశాంతత చేకూరింది. ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తూనే యుటా రాష్ట్రంలోని మోఅబ్ పట్టణానికి దగ్గర్లోని ఓ గుహలోకి వెళ్లిపోయాడు.
(Image : Only Human)
జీవనం ఎలా?
గుహలో ఉన్న డేనియల్ దగ్గర చిల్లిగవ్వ లేదు. దాంతో ఆకలి వేస్తే చెత్త డబ్బాలు(Dust bin) వెతకడం మొదలు పెట్టాడు. అందులో తనకు దొరికిన ఆహారం, వస్తువులను సేకరించుకొని గుహకు తెచ్చుకునేవాడు. నాన్‌వెజ్ ఆహారం తినాలనిపిస్తే రోడ్డుపై చచ్చిపడిన జంతువులను తెచ్చి వండుకునేవాడు. ఇవే కాకుండా గుహకు సమీపంలో కొన్ని రకాల కూరగాయలను(vegetable) కూడా పెంచాడు. సాధారణంగా బిచ్చగాళ్లను, నిరుపేదలను ఆదుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఫుడ్ స్టాంప్స్(food stamps) ఇస్తుంది. వాటిని వినియోగించుకొని ఆహార కేంద్రాల్లో తినవచ్చు. డేనియల్ అవేవీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. తనకు తీరిక దొరికినప్పుడు బ్లాగ్(blog) రాసుకోవడానికి మాత్రం లైబ్రరీకి వెళ్లేవాడు. అక్కడి కంప్యూటర్లను వినియోగించి బ్లాగ్ రాసేవాడు.
సులభంగానే తిండి..
తన మొత్తం గుహ జీవితంపై డేనియల్ మాట్లాడుతూ.. ‘90వ దశకం నుంచే నేను కొన్నిసార్లు గుహల్లో ఉండటం అలవాటు చేసుకున్నాను. దాంతో ధనం, ఇల్లు లేదనే లోటు నాకు తెలియలేదు. ఒంటరి జీవితం ఎంచుకోవడానికి ముందే నాకు చాలా మంచి ఉద్యోగం ఉండేది. సంపాదించి ఖర్చు చేయడం నాకు నచ్చలేదు. అందుకే ప్రకృతి వైపు అడుగులు వేశాను. దాదాపుగా ఆది మానవుల జీవన శైలిని అనుసరిస్తూ కాలం గడిపానని’ చెప్పాడు.
అందరూ డబ్బు లేకుంటే తిండి ఎలాగని ఆలోచిస్తారు. కానీ, తనకు సులభంగా తిండి దొరికేదని డేనియల్ తెలిపాడు. ప్రజలు చాలా ఆహారం చెత్తకుండీల్లో పడేస్తున్నారు. దాంతో కడుపు నింపుకొన్న తాను ఏ రోజూ జబ్బు పడలేదని స్పష్టం చేశాడు. గుహలో జీవించాలనుకోవడం వెనుక ప్రధాన కారణం ఏంటని డేనియల్‌ను అడగ్గా.. ఆధునిక జీవన విధానం చూసి చాలా మానసిక ఒత్తిడికి గురయ్యానని, నాకంటూ ఓ ప్రత్యేక జీవితం ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. సంచార జీవనం ఎంచుకున్న తరువాత పూర్తిగా స్వేచ్ఛ(Freedom) దొరికిందని, ఒత్తిడి దూరమైందని తన అనుభవాన్ని వివరించాడు.
తల్లిదండ్రుల కోసం..
ఇలా సంతోషంగా జీవనం సాగిస్తున్న డేనియల్ 2016లో మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చాడు. తన తల్లిదండ్రులు బాగా వయోవృద్ధులు కావడంతో వారికి చేదోడుగా ఉండేందుకు తాను ఎంచుకున్న జీవన విధానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి డేనియల్ జీవితం గురించి పలు పత్రికలు, టీవీ, యూట్యూబ్ ఛానళ్లలో కథనాలు ప్రసారమవుతూ ఉన్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: సెహ్వాగ్ టాప్-5 బ్యాటర్లు వీరే.. లిస్ట్‌లో లేని విరాట్, గిల్!
-
World News
Asiana Airlines: త్వరగా విమానం దిగాలని.. గాల్లో ఎమర్జెన్సీ డోర్ తెరిచాడట..!
-
Movies News
Vicky Kaushal: సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది పక్కకు తోసేసిన ఘటనపై స్పందించిన విక్కీ కౌశల్
-
India News
NITI Aayog: మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. 9 మంది సీఎంలు డుమ్మా
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
TDP-Mahanadu: పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది రాష్ట్రం పరిస్థితి: చంద్రబాబు