Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రివ్యూ: ‘దసరా’.. నాని సినిమా ఎలా ఉందంటే?
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాని (Nani). క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన నటనను ఇష్టపడతారు. అందుకు తగినట్లుగానే నాని కథల ఎంపిక ఉంటుంది. ఇప్పుడు శ్రీరామనవమికి ‘దసరా’ (Dasara)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాని మాస్ లుక్‌లో దర్శనమివ్వడం, అతనికి జోడీగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించడం, ప్రచార చిత్రాలు మెప్పించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘దసరా’ అందుకుందా? (Dasara Movie Review) నాని ఏ మేరకు మెప్పించారు? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అలాంటి కృత్రిమ మేధ అభివృద్ధిని ఆపేయండి..
టెక్ వర్గాల్లో కృత్రిమ మేధ (Artificial Intelligence) ఎంత ఆసక్తి కలిగిస్తుందో.. అంత ఆందోళనకూ గురిచేస్తోంది. ఉద్యోగాలు పోవడంతో పాటు భవిష్యత్‌లో ఇది మానవాళి ఉనికికే ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్ (Elon Musk) వంటి టెక్ నిపుణులు సైతం ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఈ ఐపీఎల్‌కు దూరమైన కీలక ఆటగాళ్లు వీరే..
శుక్రవారం నుంచి ఐపీఎల్ (IPL 2023) సందడి ప్రారంభం కానుంది. ఆయా జట్లు ఇప్పటికే సిద్ధమైపోయాయి. అయితే కొంతమంది కీలక ఆటగాళ్లు మాత్రం దూరం కావడం అభిమానులను నిరాశకు గురి చేసే అంశం..వాళ్లెవరో చూద్దామా? రిషభ్ పంత్: గత సీజన్‌లో దిల్లీ కెప్టెన్ అయిన పంత్.. ఇటీవల రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న విషయం తెలిసిందే. దిల్లీ విజయాల్లో కీలకంగా ఉన్న పంత్ మిస్సవడం ఆ జట్టుకు పెద్ద లోటే. అతడి స్థానంలో డెవిడ్ వార్నర్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ₹10 వేలకే మోటో జీ13.. 5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరా
Moto G13 | ఇంటర్నెట్ డెస్క్: ‘జీ’ సిరీస్‌లో మోటోరోలా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. మోటో జీ13 పేరిట వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉంది. అయితే, ఇది 4జీ సపోర్ట్ చేసే ఫోన్ కావడం గమనార్హం. దీని ధర రూ.9,999. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి ఐదు శాతం క్యాష్‌బ్యాంక్ లభిస్తుంది. ఇది గతంలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కియా పరిశ్రమ ఎదుట నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్..!
తెలుగుదేశం (TDP) అధికారంలో ఉన్నప్పుడు కియా (KIA) సహా పెద్దసంఖ్యలో పరిశ్రమలు తెచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తే.. ఇప్పుడు అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. సత్యసాయి జిల్లా పెనుకొండ క్రాస్ నుంచి 55వ రోజు పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. కియా పరిశ్రమ ఎదుట సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు (Chandrababu) కృషి, అప్పుడు మంత్రిగా పనిచేసిన అమరనాథ్ రెడ్డి, అధికారుల శ్రమకు కియా నిదర్శనమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. IRCTC ఇ-వ్యాలెట్‌తో క్షణాల్లో టికెట్ బుకింగ్..
రైలు టికెట్ బుక్ (Train Ticket) చేయడమంటేనే ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. పక్కా ప్రణాళిక ఉండీ నెలల ముందు టికెట్ బుక్ చేసుకునే వారికి పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎటొచ్చీ తత్కాల్‌లోనో, కొన్ని గంటల ముందో టికెట్ బుక్ చేయాలంటేనే అసలు సమస్య. అదే సమయానికి బ్యాంక్ సర్వర్ మొరాయిస్తే ఇక అంతే సంగతులు. టికెట్లు ఉన్నా బుక్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఒక్కోసారి ప్రయాణానికి కొన్ని గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేయాల్సి రావొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రాహుల్ గాంధీపై దావా వేస్తా: లలిత్ మోదీ
‘మోదీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఇలాంటి సమయంలో ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi).. రాహుల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో తనపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకు గానూ.. కాంగ్రెస్ నేతపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో రాహుల్, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. చాలా కార్లు అమ్మేసిన విరాట్.. కారణం చెప్పేసిన స్టార్ బ్యాటర్
ఐపీఎల్ 16వ (IPL 2023) సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ కొత్త టాటూతో కనువిందు చేయనున్నాడు. మరోవైపు తనకు కార్లంటే విపరీతమైన ఇష్టమని, ఒకప్పుడు చాలా కార్లు తన గ్యారేజీలో ఉండేవని, అయితే వాటిలో కొన్నింటిని అమ్మేసినట్లు చెప్పాడు. ఇప్పుడు కేవలం అవసరమైన కార్లను మాత్రమే ఉంచుకున్నానని, వాటిలోనే ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
శంతనుడు అనే రాజు హస్తినని పాలిస్తుండేవాడు. ఓరోజు నదీ తీరాన గంగను చూసి ప్రేమించి ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమె ప్రేమను ఒప్పుకొంది. కానీ ఓ షరతు పెట్టింది. తాను ఏం చేసినా ప్రశ్నించొద్దు అని మాట తీసుకుంది. ఈక్రమంలో వారికి పుట్టిన ఏడుగురు కుమారుల్ని ఒకరి తర్వాత ఒకరిని నదిలో ముంచేసింది. చివరగా ఎనిమిదో కుమారుడిని కూడా నదిలో వదిలేందుకు వెళ్లగా.. శంతనుడు కన్న బిడ్డల్ని ఎలా పొట్టన పెట్టుకుంటావంటూ అడ్డుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. చదువుకోమని చెప్పారని.. 9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య
స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా తల్లిదండ్రులు వచ్చి చదువుకోమని హెచ్చరించడంతో తొమ్మిదేళ్ల చిన్నారి ఉరివేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. తమిళనాడు (TamilNadu) లోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూర్ (Tiruvallur)కు చెందిన చిన్నారి ప్రతిక్ష (Pratiksha) నాలుగో తరగతి చదువుతోంది. ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ చేస్తూ సరదాగా గడిపే తనని ఇరుగుపొరుగు వారు, స్నేహితులు ‘రీల్స్‌క్వీన్’ అని పిలుస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్