Updated : 20 May 2022 13:11 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Sri Lanka: 70 ఏళ్ల శ్రీలంక చరిత్రలో తొలిసారి రుణ ఎగవేత..!

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలను ఎగవేసింది. ఆ దేశం చెల్లించాల్సిన 78 మిలియన్‌ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్‌ పిరియడ్‌ కూడా బుధవారం ముగిసిపోవడంతో అధికారికంగా ఎగ్గొట్టినట్లైంది. ఈ విషయాన్ని గురువారం రెండు క్రెడిట్‌ ఏజెన్సీలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం తమ దేశం ముందస్తు దివాలాలో ఉందని శ్రీలంక రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ నందలాల్‌ వెల్లడించారు. ‘‘మా వైఖరి స్పష్టంగా ఉంది. వారు రుణాలను పునర్‌వ్యవస్థీకరించేంత వరకూ మేము చెల్లింపులు చేయలేం. దానిని ముందస్తు దివాలా అంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టెస్లాపై నిర్లక్ష్యమా..?ప్రసక్తే లేదంటున్న మస్క్‌

ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఎలాన్ మస్క్‌ టెస్లాపై దృష్టిసారించడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ కంపెనీలో మదుపు చేసిన వారు దీనిపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. తమ వద్ద టెస్లా షేర్లను విక్రయించడం ద్వారా తమ అసహనాన్నీ వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌ మీద మాత్రమే దృష్టి సారించడం వల్ల టెస్లా ప్రణాళికలు, లక్ష్యాలు దెబ్బతింటాయన్నదే వారి ఆందోళన. ఈ పరిణామాల నేపథ్యంలో టెస్లా షేర్లు ఇటీవల భారీ కుంగుబాటును చవిచూశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కోహ్లీ-డుప్లెసిస్‌ మద్దతు ముంబయికే.. మొత్తం 25 మంది అట..!

బెంగళూరు ఆశలన్నీ ఇప్పుడు ముంబయిపైనే నెలకొన్నాయి. గతరాత్రి డుప్లెసిస్‌ టీమ్ గుజరాత్‌పై గెలవడంతో ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే, ఆ జట్టు నెట్‌రన్‌రేట్‌ (-0.253) తక్కువగా ఉండటంతో దాని భవితవ్యం ముంబయి, దిల్లీ జట్ల ఫలితంపై ఆధారపడింది. శనివారం రాత్రి జరిగే ఈ మ్యాచ్‌లో దిల్లీ గెలిస్తే తదుపరి దశకు చేరుకుంటుంది. ఒకవేళ ముంబయి గెలిస్తే బెంగళూరుకు అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో ముంబయి గెలవాలని బెంగళూరు అభిమానులతో సహా ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. NTR: ‘విశ్వామిత్ర’ టు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఎన్టీఆర్‌ నట ప్రయాణమిదీ

రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్‌ ఒకరు. అందుకే ‘నటనలో నీ తర్వాతే ఎవరైనా’ అని అంటారు ఆయన సినిమాలను చూసిన వారందరూ. సింగిల్‌ టేక్‌లో భారీ సంభాషణలు చెప్పదగ్గ, అదిరిపోయే స్టెప్పులు వేయగలిగిన ఈ యంగ్‌ టైగర్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని సంగతులు చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

NTR 31: ఎన్టీఆర్‌ 31 ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. ఇంట్రెస్టింగ్‌ లుక్‌లో తారక్‌

5. ఉద్యోగాల కోసం భూములు రాయించుకుని.. లాలూపై కొత్త కేసు

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరో కొత్త కేసు నమోదు చేసింది. లాలూ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై ఈ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గుంటూరులో దారుణం: రూ.200 కోసం లారీతో ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌.. మహిళ మృతి

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూ.200 ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్‌ మహిళను ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో లారీ కింద పడి ఆమె మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన రమణ(40) అనే మహిళ చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. ఉపాధి కోసం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని చిలకలూరిపేట నుంచి గుంటూరుకు వెళ్లేందుకు ఆమె ఓ లారీ ఎక్కింది. గుంటూరులోని నాయుడుపేట జిందాల్‌ కంపెనీ సమీపంలోకి చేరుకోగానే పిల్లలతో సహా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Disha Case: ఎలాంటి చర్యలు తీసుకోవాలో హైకోర్టే నిర్ణయిస్తుంది: సుప్రీంకోర్టు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్‌ చేయలేదని.. తదుపరి విచారణ, తీసుకునే చర్యలపై హైకోర్టు నిర్ణయిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ వ్యవహారంపై సిర్పూర్కర్ కమిషన్‌ సవివర నివేదిక ఇచ్చిందని.. పలు సూచనలు చేసిందని తెలిపింది. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. TSLPRB: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్‌ డేట్‌!

తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఈరోజు రాత్రి 10గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో 17,291 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 2వ తేదీన ప్రారంభమైన ప్రక్రియ నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తకుండా వాటి సామర్థ్యాన్ని అధికారులు పెంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వైకాపా ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు కారులో డ్రైవర్‌ మృతదేహం

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ బాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్‌ సుబ్రమణ్యందిగా గుర్తించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తనతో పాటు  డ్రైవర్‌ను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఉదయ్ బాబు సమాచారమిచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 2గంటలకు తన కారులోనే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Andhra News: తండ్రీకుమారుల దాడి.. వార్డు వాలంటీర్‌ మృతి

తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వార్డు వాలంటీర్‌పై తండ్రీకుమారులు దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని మారిస్‌పేటలో చోటుచేసుకుంది. ఈ దాడిలో వాలంటీర్‌ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి పట్టణంలోని 24వ వార్డుకు వాలంటీర్‌గా పనిచేస్తున్న సందీప్ (22) నుంచి మైనర్ బాలుడు రెండు నెలల క్రితం రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని