Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Nov 2022 13:13 IST

1. కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి.. ఆ తృప్తే వేరు: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వం దిక్కుమాలిన పనులు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. శిశుపాలుడిలా సీఎం జగన్‌ చేసిన తప్పులు 100 దాటిపోయాయని.. ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చారని ఆక్షేపించారు. సీఎం జగన్‌ చేస్తున్న అరాచకాలకు జవాబు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రోజుకు 4 మిలియన్‌ డాలర్ల నష్టం.. ఉద్యోగుల కోత తప్పలేదు: మస్క్‌

ట్విటర్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దాదాపు సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌. దీనిపై విమర్శలు వ్యక్తమవడంతో స్పందించిన మస్క్‌ ఉద్యోగుల కోతలను సమర్థించారు. కంపెనీ రూ.వేల కోట్ల నష్టాల్లో ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్విటర్‌లో తెలిపారు. ‘‘ట్విటర్‌ రోజుకు 4 మిలియన డాలర్లకు పైగా నష్టపోతున్నప్పుడు.. దురదృష్టవశాత్తూ సిబ్బంది తగ్గింపు మినహా మరో అవకాశం కన్పించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గుంతలు పూడ్చలేరు.. రోడ్లు వేయలేరుగానీ.. విస్తరణ కావాలా?: పవన్‌ కల్యాణ్‌

మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం అనే చిన్న గ్రామంలో తెదేపా, జనసేన సానుభూతిపరులు, కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చివేసిన విషయం తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చామనే కక్షతోనే ఇళ్లను కూల్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటంలోని బాధితులను పరామర్శించి వారికి సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం బయలుదేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారతీయులు టాలెంటెడ్‌.. పుతిన్‌ ప్రశంసల వర్షం

భారతీయులు ప్రతిభావంతులు అని, అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగే సమర్థులని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ కొనియాడారు. నవంబరు 4న రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుతిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ చిరకాల మిత్రదేశమైన భారత్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత తొలి ఓటరు నేగీ కన్నుమూత

స్వతంత్ర భారత తొలి ఓటరు, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 106 ఏళ్ల శ్యామ్‌ శరణ్‌ నేగీ శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు మృతిచెందినట్లు నేగీ కుటుంబసభ్యులు వెల్లడించారు. మూడు రోజుల క్రితమే ఆయన రాబోయే శాసనసభ ఎన్నికలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టీమ్‌ ఇండియా.. ఛాంపియన్‌లా ఆడాల్సిందే..!

ఉత్కంఠభరిత పోరులో భారత్‌ విజయం.. వినటానికి ఇది బాగానే ఉన్నా.. మ్యాచ్‌పై ఆద్యంతం భారత్‌ పట్టు చూపించలేదనే దానర్థం. భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించేందుకు ఇంకా కేవలం 3 మ్యాచ్‌ల దూరంలో ఉంది. మూడు మ్యాచ్‌లూ గెలిచి తీరాల్సినవే. ఇండియా ఆటగాళ్ల ఘనమైన రికార్డులతో జట్టు పేపర్‌పై బలంగానే కనిపిస్తోంది. కానీ, ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌పై మినహా భారత్‌ రెండు మ్యాచ్‌లను చివరి నిమిషంలో గెలుచుకొంది. బలమైన సౌతాఫ్రికాపై ఓడిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మాదకద్రవ్యాల సరఫరా కేసు.. కీలక సూత్రధారి అరెస్టు

మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక సూత్రధారిని నార్కోటిక్‌ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎడ్విన్‌ను నార్కోటిక్‌ విభాగం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాల సరఫరాలో ఎడ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నారాయణ బోర్కర్ అనే వ్యక్తిని మూడు నెలల క్రితం నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ హైదరాబాద్‌లో సరఫరా చేయడంలో నారాయణ బోర్కర్‌ది కీలక పాత్ర.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్లే స్టోర్‌లో 2022 బెస్ట్ యాప్‌ ఏది.. ఓటేశారా?

పుస్తక ప్రియులకు లైబ్రరీ ఉన్నట్లుగానే.. ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లేస్టోర్‌ కూడా అలాంటిదేనని చెప్పోచ్చు. ఎలాంటి సర్వీసుకైనా ఒకటి కంటే ఎక్కువ యాప్‌లు సేవలను అందిస్తుంటాయి. వాటిలో బెస్ట్‌ యాప్‌లను మాత్రమే ఎక్కువ మంది యూజర్లు డౌన్‌లోడ్ చేస్తుంటారు. అవే ట్రెండింగ్‌లో ఉంటాయి కూడా. అలాంటి వాటిలోంచి ఏటా బెస్ట్‌ యాప్‌ను గూగుల్ ఎంపిక చేస్తుంది. ఇందుకోసం టాప్‌ టెన్‌ యాప్‌లను ఎంపిక చేసి యూజర్‌ ఛాయిస్‌ యాప్‌ పేరుతో ఓటింగ్ నిర్వహిస్తుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ సినిమా టైటిల్‌ ఇలా పెట్టుంటే ఇంకాస్త ఆసక్తి పెరిగేది: పరుచూరి

సుధీర్‌బాబు - కృతిశెట్టి జంటగా నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. సెప్టెంబర్‌ 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమాపై తాజాగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘పరుచూరి పలుకులు’ వేదికగా ఈ సినిమాపై రివ్యూ చెబుతూ వీడియో షేర్‌ చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మహిళను ఈడ్చి పడేశారు.. జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో దారుణం

మహా విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో అభివృద్ధి పనులపై ప్రశ్నించిన 48వ వార్డు కార్పొరేటర్‌, భాజపా ఫ్లోర్‌ లీడర్‌ గంకల కవితను మేయరు సస్పెండ్‌ చేశారు. ఆమెను మార్షల్స్‌ ఈడ్చుకెళ్లి బయట పడేశారు. శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశం జీరో అవర్‌లో చర్చ సందర్భంగా మేయరు హరి వెంకటకుమారి... కవితకు మాట్లాడే అవకాశమిచ్చారు. ‘కౌన్సిల్‌ ఏర్పాటై ఏడాదిన్నరైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని