icon icon icon
icon icon icon

YSRCP: పెనమలూరులో వైకాపా ప్రలోభాలు.. పంపిణీకి సిద్ధంగా ఉంచిన వస్తువులు స్వాధీనం

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల  ప్రలోభాలకోసం ఉంచిన వివిధ రకాల వస్తువుల్ని పోలీసులు పట్టుకున్నారు.

Published : 08 May 2024 15:48 IST

పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల ప్రలోభాల కోసం ఉంచిన వివిధ రకాల వస్తువుల్ని పోలీసులు పట్టుకున్నారు. గంగూరు ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేశ్‌ అద్దెకు తీసుకున్నారు. అందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గృహోపకరణ వస్తువులతో పాటు నగదు దాచి ఉంచారని సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు అందడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అక్కడికి వెళ్లింది. తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లోకి ప్రవేశించడానికి గంటన్నర సమయం పట్టింది. పెనమలూరు పోలీసుల సహకారంతో తాళం పగులగొట్టి లోపలికి వెళ్లిన అధికారులు.. వైకాపాకు సంబంధించిన పింగాణి సెట్స్‌, ప్లాస్క్‌లు ఇతర వస్తువుల్ని గుర్తించారు. వీటితో పాటు వైకాపా అభ్యర్థి జోగి రమేశ్‌ ఫొటో ముద్రించి ఉన్న టోపీలు, టీ షర్ట్స్‌, బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img