Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. Hyderabad: ఇంటి భోజనంపైనే మక్కువ.. బైక్ ట్యాక్సీల ద్వారా లంచ్ బాక్స్‌లు..
నగరంలో వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు మధ్యాహ్నం పూట తినేందుకు ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదివరకైతే ఉదయం తమతోపాటు లంచ్‌బాక్స్‌లను ఆఫీసులకు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం నగరంలో బైక్ ట్యాక్సీ యాప్ సేవలు అందుబాటులోకి వచ్చాక.. లంచ్ సమయానికి వేడివేడి భోజనాన్ని ఇంటి నుంచి తెప్పించుకుంటున్నారు. ఇటీవల తమ బుకింగ్‌లలో ఇవి పెరిగాయని సంబంధిత యాప్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రూ. 100 కోట్లు... వచ్చేనా?!
ఆంధ్రవిశ్వవిద్యాలయానికి శతాబ్ది నిధులు వస్తాయా? రావా? అన్నది చర్చనీయాంశంగా మారింది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యు.జి.సి.) వందేళ్లు పూర్తి చేసుకోబోయే విశ్వవిద్యాలయాలకు రూ.వంద కోట్లను కేటాయిస్తుంటుంది. నాలుగేళ్ల నుంచి కేంద్రం ఈ నిధులను ఏ విశ్వవిద్యాలయానికీ ఇవ్వడం లేదు. ఈ ఏడాదైనా ఏయూకు నిధులు దక్కుతాయా, లేదా అన్నది తేలాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. Ramappa Temple: అరచేతిలో రామప్ప విశేషాలు..
కాకతీయుల కళావైభవానికి నిదర్శనం రామప్ప ఆలయం.. యునెస్కో గుర్తింపు దక్కడంతో విశ్వఖ్యాతిని గడించింది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రూ.62 కోట్లతో చేపట్టనున్న ప్రసాద్ పథకం పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా సందర్శకుల కోసం సకల సౌకర్యాలను కల్పించే చర్యలు తీసుకుంటున్నారు. రామప్పకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేవిధంగా ప్రత్యేక యాప్, వైబ్‌సైట్‌ను రూపొందించేందుకు సన్నాహలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. దక్కన్ బండి.. చూద్దాం రండి
మొదటి తరం అల్బియాన్ బస్సును బుధవారం పండిట్‌నెహ్రూ బస్టేషన్ సిటీ పోర్ట్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఉద్యోగ విరమణ చేసిన ఆర్టీసీ డ్రైవర్లతో రిబ్బన్ కత్తిరించి బస్సును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పాల్గొని మాట్లాడుతూ బస్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులందరికీ కనిపించేలా దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రాజన్న గుడి.. అంతర్జాలంలో వెనకబడి
దేశంలో ప్రసిద్ధి పొందిన శైవక్షేత్రాల్లో వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం ఒకటి. దక్షిణ కాశీగా పేరొందిన ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శివరాత్రికి రాజన్న దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు తరలి వస్తుంటారు. అలా వచ్చే భక్తులు ముందుగానే ఇక్కడి ప్రత్యేక పూజల వివరాలు, గదులు, పర్యాటక స్థలాలు ఇలా ప్రతిదీ తెలుసుకోవాలంటే అంతర్జాలం ఒక్కటే ఆధారం. కానీ... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. పువ్వుకో పరిమళం
శ్రీవారితోపాటు తితిదే ఆలయాల్లో ఉపయోగించే పుష్పాల నుంచి తయారు చేసే ఏ వస్తువునైనా పవిత్రంగా భావించి తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. తిరుమలతోపాటు స్థానిక ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు వినియోగించే పూలను సద్వినియోగం చేస్తూ తితిదే అగరబత్తీలు తయారు చేస్తోంది. ఇందుకోసం ఒక్కో పుష్పం నుంచి ఒక్కో రకమైన అగరబత్తీలు ఉత్పత్తి చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. తానియా.. మేనియా
ఒక వైపు చదువులో తనకంటూ స్థానాన్ని సంపాందించుకొంటూ మరో వైపు యోగా, చిత్రలేఖనం, కవితా రచనలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వివేకానందుడి విలువలు, అబ్దుల్ కలాం ఆశయాలే తన లక్ష్య సాధనకు మార్గదర్శంగా నిలిచాయని చెబుతున్నారు ఆర్మూర్ పట్టణానికి చెందిన శేరు పోశెట్టి-లక్ష్మి కుమార్తె తానియా. ఇంటర్ నుంచి ఐఐటీ ప్రవేశం వరకు ప్రతిభచాటారు. దక్షణ సంస్థ పరీక్షల విభాగంలో రాష్ట్ర సమన్వయకర్తగా సేవలందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ష్..ఆ వైపు చూడొద్దు!
నెల్లూరు నగరంలో అక్రమ భవన నిర్మాణాలకు అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తున్నారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగానే.. మేమున్నాం అంటూ ప్రోత్సహిస్తున్నారు. పేరుకు అనుమతి తీసుకుని.. ఇష్టానుసారం నిర్మిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకుండా అడ్డుకుంటున్నారు. ఎంతలా అంటే.. భవన నిర్మాణ భూమి పూజ దగ్గర నుంచి ప్రారంభోత్సవం వరకు వారే దగ్గరుండి చూసుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. Content Writers: చదివించేలా రాస్తారా..?
కంటెంట్ రైటింగ్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే... ప్రత్యేకంగా ఈ డిగ్రీలు చదివిన వారే అర్హులు అనే నిబంధనలు ఏవీ లేవు. ఎలాంటి విద్యార్హతలు ఉన్నా సరే... ఇందులో రాణించే అవకాశం ఉంది. అయితే దానికి ముందుగా చేయాల్సినది... ఎక్కువగా చదవడం. ఎంత చదివితే అంత బాగా రాయడం వస్తుంది. రాయాలి అనుకుంటున్న భాషలో ఉన్న సాహిత్యం చదివేందుకు ప్రయత్నించాలి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ప్రకాశంలో గ్రావెల్ గద్దలు!
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల అండదండలతో ప్రకాశం జిల్లాలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. వారి దెబ్బకు ఒంగోలు, టంగుటూరు సమీపంలోని కొండలు కరిగిపోతున్నాయి. నిత్యం వందలాది టిప్పర్లలో గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. ఒంగోలు మండల పరిధిలోని యరజర్ల కొండలు 800 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra news: తమ్ముడూ నేనూ వస్తున్నా.. గంటల వ్యవధిలో ఆగిన గుండెలు
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!
-
India News
Sonia Gandhi: మోదీ బడ్జెట్.. పేదలపై నిశ్శబ్ద పిడుగు..!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: వణికిపోతున్న తుర్కియే.. గంటల వ్యవధిలోనే మూడో భూకంపం..!