Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 05 Dec 2022 21:11 IST

1. Exit polls2022: గుజరాత్‌లో మళ్లీ కమలదరహాసమే.. హిమాచల్‌లో హోరాహోరీ!

దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల (Assembly election 2022) సమరం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించి పలు ప్రఖ్యాత సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల స్వరాష్ట్రమైన గుజరాత్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో మళ్లీ కమలమే వికసించబోతున్నట్టు అన్ని సర్వేలూ ముక్తకంఠంతో చెప్పాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Covid 19: కరోనా వైరస్‌ చైనా నిర్మితమే.. .. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకయ్యింది: అమెరికా శాస్త్రవేత్త

యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కొవిడ్‌-19 మూలాలపై (Covid Origin)మూడేళ్లయినా ఇంకా మిస్టరీ వీడలేదు. చైనాలోని వుహాన్‌లో తొలుత బయటపడిన ఈ వైరస్‌కు సంబంధించిన మూలాలపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఫలితం మాత్రం తేలలేదు. ఈ క్రమంలోనే.. కొవిడ్‌ మానవ నిర్మిత వైరసేనంటూ ఓ ప్రముఖ అమెరికన్‌ ఎపిడమాలజిస్ట్‌ సంచలన విషయాన్ని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

VIDEO: బీట్‌రూట్‌తో గుండె ఆరోగ్యం మెరుగు

3. LIC on Whatsapp: వాట్సాప్‌లో ఎల్‌ఐసీ సేవల కోసం ఎలా రిజిస్టర్‌ అవ్వాలి?

జీవిత బీమా రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) పాలసీదారులకు ఎంతగానో ఉపయోగపడే సేవలను ప్రారంభించింది. వాట్సాప్‌ (Whatsapp)లో 10 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారులు ఎల్‌ఐసీ కేటాయించిన వాట్సాప్‌ నంబర్‌కు హాయ్‌ (Hi) అని సందేశం పంపిస్తే చాలు.. సేవలను సులువుగా పొందొచ్చు. ప్రీమియం బకాయిలు, బోనస్‌ సమాచారం వంటి వివరాలు తెలుసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Mirzapur: ‘మీర్జాపూర్‌ 3’ అప్‌డేట్‌ వచ్చేసింది.. ఎమోషనల్‌ అయిన గుడ్డూ భయ్యా!

క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘మీర్జాపూర్‌’ (Mirzapur). ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు హిట్‌ అందుకోవడంతో మూడో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానిపై ఓ అప్‌డేట్‌ వచ్చింది. ‘మీర్జాపూర్‌ 3’ (Mirzapur 3) చిత్రీకరణ పూర్తయినట్టు నటుడు అలీ ఫజల్‌ (గుడ్డూ భయ్యా) (Ali Fazal) సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. MLAs Bribery case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సిట్‌ నోటీసులపై హైకోర్టు స్టే

తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భాజపా కీలక నేత బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) జారీ చేసిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై స్టే విధించాలని కోరుతూ వారిద్దరూ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఈ నెల 13వ తేదీ వరకు సిట్‌ నోటీసులపై స్టే విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

YSRCP: ప్రతిపక్షాలపై వైకాపా దాడులు.. ప్రేక్షక పాత్రలో పోలీసులు..!

6. Drgus: ఏపీలోనే మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ అధికం: కేంద్రం నివేదిక

దేశవ్యాప్తంగా 2021-22లో అత్యధికంగా ఏపీలోనే మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశంలో 2021-22లో పట్టుబడిన మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’ 2021-22 పేరుతో కేంద్రం నివేదిక విడుదల చేసింది. ఒక్క ఏపీలోనే 18వేల కిలోల మాదకద్రవ్యాలు, వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Ram Mohan Naidu: వైకాపా అక్రమాలను పార్లమెంట్‌లో ఎత్తిచూపుతాం: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. వైకాపా కోరినట్లుగా అత్యధిక ఎంపీలను రాష్ట్ర ప్రజలు గెలిపించినప్పటికీ.. వారంతా రాష్ట్ర హక్కులను కేంద్రంలో తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఎంపీ కనకమేడలతో కలిసి ఆయన దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ICC: అండర్-19 ప్రపంచకప్‌ కెప్టెన్‌గా షెఫాలీ వర్మ.. జట్టును ప్రకటించిన బీసీసీఐ!

టీమ్‌ఇండియా(Team india) యువ బ్యాటర్‌ షెఫాలీ వర్మ(Shafali verma) అండర్‌-19 మహిళల జట్టు(Under-19 world cup) కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటుగా ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌గా షెఫాలీ వ్యవహరించనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ప్రకటన చేసింది. శ్వేతా సెహ్రావత్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా గోష్‌ సైతం జట్టులో స్థానం సంపాదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Prisoners : హిమాచల్‌ జైళ్లలో.. 40శాతం మంది ఖైదీలపై ఆ కేసులే..!

హిమాచల్‌ ప్రదేశ్‌ను మాదక ద్రవ్యాల అక్రమరవాణా (Drugs) సరఫరా ఎంతగానో వేధిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఉన్న ఖైదీల్లో(Prisoners)  40శాతానికన్నా ఎక్కువ మందిపై డ్రగ్స్‌ కేసులే ఉండటం పరిస్థితికి అద్ధం పడుతోంది. రాష్ట్రంలో నేరాల తీరు, పెండింగు కేసులకు సంబంధించి హిమాచల్‌ పోలీసులు విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. The Square Kilometre Array: ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ నిర్మాణం షురూ

21వ శతాబ్దంలో అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకదాని నిర్మాణం ప్రారంభమైంది. ది స్క్వేర్‌ కిలోమీటర్‌ ఆర్రే (The Square Kilometre Array )పేరిట అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ నిర్మాణం ఆస్ట్రేలియా(Australia)లో నేడు మొదలుపెట్టారు. దీనిని 2028 నాటికి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీని నిర్మాణం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేపట్టారు. ప్రధాన కార్యాలయం మాత్రం యూకేలో ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని