దున్నపోతుపై వచ్చి నామినేషన్‌ దాఖలు

బహదుర్‌పురా నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేస్తున్న నాచారి మండల్‌ అనే వ్యక్తి దున్నపోతుపై వచ్చి నామపత్రాలు దాఖలు చేశారు...

Published : 20 Oct 2020 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిహార్‌లో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలోనూ అభ్యర్థులు వినూత్న ప్రదర్శిస్తున్నారు. దర్భంగా జిల్లాలోని బహదుర్‌పురా నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేస్తున్న నాచారి మండల్‌ అనే వ్యక్తి దున్నపోతుపై వచ్చి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని