Road accidents: రోడ్డు ప్రమాదాలతో రూ.2.91 లక్షల కోట్ల నష్టం!

దేశ సామాజిక ఆర్థిక రంగాలపై రహదారి ప్రమాదాలు తీవ్ర ప్రభావం కలిగిస్తున్నాయని ఓ పరిశోధన వెల్లడించింది.

Published : 26 Oct 2021 13:25 IST

సామాజిక ఆర్థిక వ్యయాన్ని లెక్కగట్టిన అధ్యయనం

దిల్లీ: దేశ సామాజిక ఆర్థిక రంగాలపై రహదారి ప్రమాదాలు తీవ్ర ప్రభావం కలిగిస్తున్నాయని ఓ పరిశోధన వెల్లడించింది. గత రెండు దశాబ్దాల వాహన ప్రమాదాల డేటా ఆధారంగా ‘బాష్‌ ఇండియా అడ్వాన్స్డ్‌అటానమస్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ అండ్‌ కార్పొరేట్‌ రీసెర్చ్‌’ సంస్థ అధ్యయనం నిర్వహించింది. ఇందులో వాహన ప్రమాదాల కారణంగా భారత్‌లో రూ.1.17 లక్షల కోట్ల నుంచి రూ.2.91 లక్షల కోట్ల వరకు సామాజిక ఆర్థిక భారం పడుతోందని నిర్ధారించింది. దేశ జీడీపీలో ఇది 0.55 నుంచి 1.35 శాతం వరకు ఉంటోందని పేర్కొంది. తమ అధ్యయనం సరైన భద్రతా ప్రమాణాలు పాటించడానికి, నూతన ఉత్పత్తులను గుర్తించడానికి, వ్యాపార వ్యూహాలు రూపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. ‘‘రోడ్డు ప్రమాదాలతో తలెత్తే సామాజిక ఆర్థిక వైద్యపరమైన ఖర్చులు చాలామందిని ఇబ్బందికి గురి చేస్తాయి. వీటిని తగ్గించడం కీలకం. ఇందుకు సంబంధించిన డేటా సరిగా లేదు. అందుకే ఈ అధ్యయనం చేశాం’’ అని ఈ పరిశోధనలో పాల్గొన్న బాష్‌ సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ గిరికుమార్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని