మన టీకాలు కలిపేద్దామా..?
ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో వ్యాక్సిన్ సమర్థతను మరోసారి పరీక్షించేందుకు ఆ సంస్థ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ రూపకర్తలు స్పందించారు.............
ఆస్ట్రాజెనెకాకు స్పుత్నిక్ రూపకర్తల ప్రతిపాదన
మాస్కో: ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో వ్యాక్సిన్ సమర్థతను మరోసారి పరీక్షించేందుకు ఆ సంస్థ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ రూపకర్తలు స్పందించారు. వ్యాక్సిన్ సమర్థతను పెంచేందుకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను స్పుత్నిక్ వ్యాక్సిన్‌తో కలిపేందుకు ప్రయత్నించాలని ప్రతిపాదించారు. ‘మరోసారి కొత్తగా పరిశోధనలు ప్రారంభించే బదులు, మేం తయారుచేసిన వ్యాక్సిన్‌తో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కలపవచ్చు. ఈ రెండూ మానవ అడినోవైరస్ వెక్టార్‌ను వినియోగించి అభివృద్ధి చేసినవే. ఒకవేళ ఇలాచేస్తే మరింత సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవచ్చు’ అని స్పుత్నిక్ వ్యాక్సిన్ రూపకర్తలు ఆస్ట్రాజెనెకాకు సూచిస్తూ ట్విటర్లో వెల్లడించారు.
తొలి విశ్లేషణ నివేదిక ప్రకారం.. తమ వ్యాక్సిన్ 92శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్పుత్నిక్ ఇప్పటికే ప్రకటించింది. రెండోసారి విశ్లేషణలో 95శాతం సమర్థతను కనబరిచినట్లు ఈ మధ్యే వెల్లడించింది. అయితే, ఆస్ట్రాజెనెకా మాత్రం 70శాతం సమర్థత కలిగివుందని, మరో విధానంలో 90శాతం వరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది. సమర్థత తక్కువగానే ఉన్నప్పటికీ దీన్ని వ్యాక్సిన్లలో గేమ్ ఛేంజర్‌గానే అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా టీకా ధర చాలా తక్కువగా ఉండటం, సాధారణ రిఫ్రిజిరేటర్లలోనే నిల్వ ఉంచుకోవడం కారణంగా దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా భిన్న డోసుల మధ్య సమర్థత విషయంలో వైరుధ్యం తలెత్తడంతో నిపుణులు అనేక సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా సమర్థతను తేల్చేందుకు మరోసారి ప్రయోగాలు జరపాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో పాస్కల్ సోరియట్ తెలిపారు.
సైనిక బలగాలకు టీకా పంపిణీకి సిద్ధం!
గతకొన్ని రోజులుగా రష్యాలో కరోనా వైరస్ తీవ్రత పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగా ఆ దేశానికి చెందిన 4లక్షల మంది సైనిక బలగాలకు టీకాను ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నట్లు రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షోయగు వెల్లడించారు. ఇప్పటికే 2500 మంది సైనిక సిబ్బంది టీకాను ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దాదాపు 80వేల మంది సైనిక సిబ్బందికి కరోనా టీకాను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, రష్యాలో ఇప్పటివరకు 22,15,133 కేసులు నమోదుకాగా వీరిలో 38,558 మంది రోగులు మృత్యువాతపడ్డారు. మిగతా దేశాలతో పోలిస్తే కొవిడ్ మరణాల రేటు రష్యాలో కాస్త తక్కువగానే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్‌లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్‌లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్‌పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్‌లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్‌లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్‌లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్‌లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్‌కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్