Sharad Pawar: అజిత్‌ పవార్‌ సీఎం కావడం కల మాత్రమే..: శరద్‌ పవార్‌

Sharad Pawar| మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ముఖ్యమంత్రి కావడం కల మాత్రమేనని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar) అన్నారు.

Published : 12 Oct 2023 22:35 IST

ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌(Ajit pawar)పై నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నటికీ ఆయన (Ajit Pawar) మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరన్నారు. దేశంలో 70శాతం రాష్ట్రాల్లో భాజపా పాలించడం లేదని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ ఆ పార్టీ అధికారం కోల్పోతుందని శరద్‌ పవార్‌ జోస్యం చెప్పారు.

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్న అజిత్‌ పవార్‌ (Deputy CM Ajit Pawar) త్వరలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే ఊహాగానాలపై శరద్‌ పవార్‌ను విలేకరులు ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. ‘అజిత్‌ పవార్‌ ముఖ్యమంత్రి కావడం కేవలం కల మాత్రమే’ అని శరద్‌ పవార్‌ బదులిచ్చారు. అంతేకాకుండా మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Elections 2024) శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ కూటమినే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

లైంగిక వేధింపులకు గురైనందుకే.. మంత్రి పదవికి రాజీనామా

కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలను చీల్చి భాజపా అధికారం చేపట్టిందని శరద్‌ పవార్‌ ఆరోపించారు. కానీ, 70శాతం రాష్ట్రాల్లో భాజపా అధికారంలో లేదన్నారు. వాంచిత్‌ బహుజన్‌ అఘాడీ నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ విపక్ష కూటమి ఇండియా (INDIA)లో చేరడం ఆహ్వానించదగిన విషయమన్నారు. ఇక సుప్రియా సూలేను ఎన్‌సీపీ అధ్యక్షురాలిని చేయాలని మాజీ సహచరుడు ఛగన్‌ భుజ్‌బల్‌ ప్రతిపాదించారని.. ఇప్పుడు ఆయనే మాట మార్చుతున్నారని అన్నారు. భాజపా నాయకురాలు పంకజ్‌ ముండేకు ఆ పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదని భావిస్తున్నట్లు తెలిసిందని.. ఆమె సొంతంగా పార్టీ పెట్టుకుంటే మంచి స్పందన వస్తుందని శదర్‌ పవార్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని