Akhilesh Yadav: ‘మీలో మహిళా రిపోర్టర్లు లేరెందుకు..?’ అఖిలేష్‌ యాదవ్‌ ప్రశ్న..!

మహిళా సర్పంచి ఎక్కడా..? అని ప్రశ్నించిన విలేకర్లపై ఎస్పీ అధినేత అసహనం వ్యక్తం చేశారు. మీలో అంతా పురుషులే ఎందుకున్నారు అంటూ ఎదురు ప్రశ్నించారు.

Updated : 04 Feb 2024 12:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహిళా సర్పంచి స్థానంలో ఆమె బంధువు ఒకరు హాజరుకావడంపై మీడియా ప్రశ్నించగా.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బారబంకి జిల్లా బల్హర పంచాయతీలో ఉత్తమ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేపట్టారు. దీనిని స్థానిక సర్పంచి షబానా ఖతున్‌ నిర్వహించాల్సి ఉంది. కానీ, కార్యక్రమం మొదలు కాగనే ఆమె అదృశ్యమైపోయారు. ఆమె భర్త సోదరుడు అయాజ్‌ ఖాన్‌ కార్యక్రమానికి వచ్చాడు. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులపై కూడా ఆమె పేరు లేదు. అయాజ్‌ పేరుంది. పక్కనే ‘ఛైర్మన్‌’ అని రాసుంది.

ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు నోటీసు

వాస్తవానికి ఆమె ఏనాడు పంచాయతీ సమావేశాలకు, కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఆమె భర్త సోదరుడే మొత్తం చూసుకునే వాడు. తాజాగా ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అఖిలేశ్‌ యాదవ్‌ వచ్చారు. మహిళా సర్పంచి గైర్హాజరుపై ఆయన్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘ఇదేమైనా కొత్తా..? చాలా మంది సర్పంచుల భర్తలు ఇక్కడున్నారు. ఇది నిజంగా ఒక సమస్యే. నేనొక ప్రశ్న అడుగుతాను.. మీ రిపోర్టర్లలో అంతా పురుషులే ఎందుకున్నారు’’ అని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఆయన మద్దతుదారులు కేరింతలు కొట్టారు. మీ ఛానల్‌లో మహిళా రిపోర్టరు లేకపోతే ఎవరిని పంపిస్తారు..? అంటూ మరో విలేకరిని నవ్వుతూ అడిగారు. తాను వారి ప్రశ్నకు సమాధానం మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని