Immunity: రోగనిరోధక శక్తికి ఇదీ డైట్‌!

కరోనా సెకండ్‌ వేవ్‌ మనపై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా వాయువేగంతో వ్యాపిస్తూ మృత్యుఘంటికలు మోగిస్తోంది.....

Published : 08 May 2021 01:10 IST

దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ మనపై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా వాయువేగంతో వ్యాపిస్తూ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ముప్పు నుంచి బయటపడేందుకు డబుల్‌ మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు రోగ నిరోధకశక్తి పెంచుకోవాలంటూ నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సహజ సిద్ధమైన ఆహార నియమాలతో శరీరానికి అధిక పోషకాలు అందించడం ద్వారా రోగ నిరోధకశక్తిని పెంచుకోవచ్చని కేంద్రం సూచిస్తోంది. MyGovIndia ట్విటర్‌ ఖాతాలో ఇమ్యూనిటీని పెంచేందుకు దోహదపడే డైట్‌ను సూచించింది. మీరు తీసుకొనే ఆహారంలో ఈ కింది పదార్థాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను ఎదుర్కోవడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుకుని కోలుకోవచ్చని చెబుతోంది. 

 

కొవిడ్ వేళ.. ఇమ్యూనిటీని పెంచే డైట్‌ ఇదే.. 
* రాగులు, ఓట్లు‌, అమరంత్‌ వంటి తృణధాన్యాలను తీసుకోవాలి. 
* ప్రొటీన్లు పుష్కలంగా లభించే కోడిమాంసం, చేపలు, గుడ్లు, పన్నీర్‌, సోయా, కాయధాన్యాలు, గింజలు తీసుకోవాలి.
* ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు కలిగిన వాల్‌నట్స్‌‌, బాదం, ఆలివ్‌ నూనె, ఆవ నూనె
* శరీరానికి తగిన విటమిన్లు, ఖనిజాలను అందించేలా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
* కరోనాతో నెలకొన్న ఆందోళనను తగ్గించేందుకు 70% కోకో మిశ్రమంతో ఉన్న డార్క్‌ చాక్లెట్‌ తక్కువ మోతాదులో తీసుకోవాలి. 
* పసుపు కలిపిన పాలు రోజుకోసారి తాగాలి.  
* రోజులో అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా సాఫ్ట్‌ ఫుడ్‌ తీసుకోవాలి. మీరు తీసుకొనే ఆహారంలో మ్యాంగోపౌడర్‌ కలిపి తింటే మంచిది.  

రోజూ శరీరానికి తగిన వ్యాయామం చేయడంతో పాటు శ్వాస సంబంధమైన టిప్స్‌ పాటిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని