United Nations: ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్‌ బాగ్చీ

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త అరిందమ్‌ బాగ్చీని నియమించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 16 Oct 2023 22:22 IST

దిల్లీ: ఐక్యరాజ్య సమితి (United Nations)లో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్‌ దౌత్యవేత్త అరిందమ్‌ బాగ్చీని నియమించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆయన బాధ్యతలను చేపట్టనున్నట్లు పేర్కొంది. 1995 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన అరిందమ్‌ బాగ్చీ (Arindam Bagchi) ప్రస్తుతం విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధిగా ఉన్న అరిందమ్‌ బాగ్చీ అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ వైఖరిని వెల్లడిస్తూ మీడియాలో తరచూ కనిపిస్తుంటారు. ఐరాసలో ప్రస్తుతం భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న రుచిరా కాంభోజ్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థల్లోనూ భారత ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. గతంలో క్రొయేషియాలో భారత రాయబారిగా, శ్రీలంకకు డిప్యూటీ హైకమిషనర్‌గా, ప్రధాన మంత్రి కార్యాలయంలో డైరెక్టర్‌గా అరిందమ్‌ బాగ్చీ విధులు నిర్వర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని