snowfall: హిమపాతంలో చిక్కుకున్న యాత్రికులు.. 400 మందిని రక్షించిన ఆర్మీ

అస్సాం (Assam)లో సంభవించిన హిమపాతం (Snowfall) లో చిక్కుకున్న 400 మంది పర్యాటకులను భారత సైన్యం రక్షించింది. ఆపరేషన్‌ హిమ్రహత్‌ పేరుతో సహాయక చర్యలు చేపట్టింది.

Published : 13 Mar 2023 00:29 IST

గువాహటి: హిమపాతం (snowfall) లో చిక్కుకున్న దాదాపు 400 మంది యాత్రికులను భారత సైన్యం (Indian Army) కాపాడింది. వారికి అవసరమైన వసతి, వైద్యసేవలు అందించి, భోజనసౌకర్యాలు కల్పించినట్లు రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ మహేంద్ర రావత్‌ తెలిపారు. శనివారం సాయంత్రం దాదాపు 100 వాహనాల్లో 400 మంది ప్రయాణికులు సిక్కింలోని నాతులా, సొంగో సరస్సును సందర్శించి తిరిగి వస్తుండగా.. ఒక్కసారిగా హిమపాతం సంభవించింది. దీంతో పర్యాటకులందరూ మంచులో చిక్కుకుపోయినట్లు ఆర్మీ వెల్లడించింది. బాధితుల్లో 142 మంది మహిళలతోపాటు 50 మంది చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న త్రిశక్తి దళానికి చెందిన సైనికులు స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా ‘ఆపరేషన్‌ హిమ్రహత్‌’ పేరుతో సహాయక చర్యలు చేపట్టారు. శనివారం రాత్రివరకు రెస్క్యూ ఆపరేషన్‌ జరిగినట్లు ఆర్మీ వెల్లడించింది. అనంతరం ఆదివారం ఉదయం రహదారిపై పేరుకుపోయిన మంచును ఆర్మీ జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీరింగ్‌ ఫోర్స్‌ సాయంతో బుల్డోజర్లతో తొలగించారు. అనంతరం పర్యాటకులు గ్యాంగ్‌టక్‌కు పయనమైనట్లు లెఫ్టినెంట్‌ కల్నల్‌ రావత్‌ ఆదివారం మీడియాకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని