Viral news: భార్య బంధువుపై భర్త కుటుంబీకులు దాడి చేస్తే ఏమైందో చూశారా?
భార్యా భర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్లిన వివాహిత బంధువుపై ఆమె అత్తమామలు దాడి చేయడంతో కారులో తప్పించుకోబోయి అడ్డొచ్చినవారిని కారుతో ఢీకొట్టాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థలను తీర్చేందుకు వచ్చిన భార్య బంధువుపై భర్త కుటుంబీకులు దాడికి దిగారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లోని వసుంధర 10 ప్రాంతానికి చెందిన భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా వివాదాలు తలెత్తాయి. దీనిని పరిష్కరించేందుకు భార్య బంధువొకరు ఆమె భర్త ఇంటికి వచ్చారు. గొడవపై చర్చిస్తున్న సమయంలో మాటకు మాట పెరిగి భర్త బంధువులు అతడిపై దాడికి దిగారు. దానిని నుంచి తప్పించుకునేందుకు ఆయన కారులో పారిపోయేందుకు యత్నించాడు. దీంతో వారంతా కారుపై దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడున్న ఓ వ్యక్తిపై నుంచి తన కారును పోనిస్తూ.. అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వారంతా అతడి కారు అద్దాలను ధ్వంసం చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఇరు కుటుంబాలపైనా కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Salman khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఈ-మెయిల్!
-
World News
Afghanistan: ఉగ్రవాదం నుంచి ప్రభుత్వాధికారులుగా.. తాలిబన్లలోనూ క్వైట్ క్విట్టింగ్!
-
Sports News
Virat Kohli: విరాట్.. లెఫ్ట్ఆర్మ్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేయాలి: డానిష్
-
India News
Amartya Sen: నోబెల్ విజేత అమర్త్యసేన్‌కు షోకాజ్ నోటీసులు
-
Movies News
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కోసం మరో యంగ్ డైరెక్టర్.. త్రివిక్రమ్ కథతో
-
Movies News
Social Look: అషు కారు ప్రయాణం.. నిఖిత ‘రెడ్’ హొయలు