
ఉచ్చులో పడొద్దు: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
దుబాయి: ఇజ్రాయెల్ పన్నే ఉచ్చులో పడొద్దంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఇరాక్‌లో ఉన్న అగ్రరాజ్య భద్రతా బలగాలపై దాడులు చేయటం ద్వారా.. యుద్ధానికి దిగేలా అమెరికాను కవ్వించేందుకు ఇజ్రాయెల్ వ్యూహం పన్నుతోందని ఇరాన్ విదేశాంగశాఖా మంత్రి మొహమ్మద్ జావేద్ జరీఫ్ హెచ్చరించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ట్విటర్‌లో ఈ ప్రకటన చేశారు.
అమెరికా ఇరాక్‌లో జరిపిన డ్రోన్ దాడిలో.. ఇరాన్ అగ్రశ్రేణి సైనిక నేత జనరల్ ఖాసిం సొలేమాని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన చోటుచేసుకుని ఏడాది కావస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇరాన్ మంత్రి అమెరికాకు సూచించారు. ఇరాక్‌లోని తమ ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన నివేదిక ప్రకారం.. అమెరికన్లపై దాడులు జరగవచ్చని కూడా ఆయన అన్నారు. అమెరికా ఏ విధమైన దాడులు జరిపినా.. తిరిగి దానికే ఎదురుదెబ్బ తగిలే విధంగా తీవ్ర పరిణామాలకు దారితీయగలదని ఆయన హెచ్చరించారు.
ఇరాక్‌లోని తమ రాయబార కార్యాలయం, భద్రతా బలగాలపై చోటుచేసుకున్న దాడులు ఇరాన్ ప్రోద్బలంతోనే జరిగినవే అని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. ఐతే, ఇరాన్ నేత జావేద్ జరీఫ్ తాజా వ్యాఖ్యపై అమెరికా ఇంకా స్పందించలేదు. ఇక ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ఈ విషయమై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.