MK Stalin: చైనా జెండా వివాదం వేళ.. స్టాలిన్‌కు ‘మాండరిన్‌’లో బర్త్‌డే విషెస్‌

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌(MK Stalin)కు భాజపా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. 

Published : 01 Mar 2024 17:59 IST

దిల్లీ: చైనా జెండా ప్రకటన వివాదం వేళ.. తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin)ను ఉద్దేశించి భాజపా(BJP) వ్యంగ్యంగా పోస్టు పెట్టింది. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్టే చెప్పి, కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

తమిళనాడులోని కులశేఖర పట్టణంలో నిర్మిస్తోన్న ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను ఉద్దేశించి డీఎంకే మంత్రి అనిత ఆర్‌ రాధాక్రిష్ణన్‌ ప్రకటన ఇచ్చారు. అందులో ప్రధాని మోదీ(Modi), స్టాలిన్‌(MK Stalin) ఫొటోలతో పాటు వెనకవైపున రాకెట్‌పై చైనా జెండా ఉండటం వివాదాస్పదమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది దేశ శాస్త్రవేత్తలు, రోదసీ రంగాన్ని అవమానించినట్లేనని మోదీ అన్నారు. ప్రజల సొమ్ముతో ప్రకటన ఇవ్వడం ద్వారా వారి పన్నులనూ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

ఇదిలాఉంటే.. ఈరోజు స్టాలిన్‌ పుట్టినరోజు. భాజపా రాష్ట్ర విభాగం ఎక్స్‌(గతంలో ట్విటర్‌)లో ఆయనకు శుభాకాంక్షలు చెప్పింది. ఇది ఆయనకు ఇష్టమైన భాష అంటూ మాండరిన్‌లో విష్ చేసి, విమర్శించింది. మాండరిన్‌.. చైనా అధికారిక భాష.  అయితే తాను ఇచ్చిన ప్రకటనపై దుమారం రేగడంతో మంత్రి అనిత క్షమాపణలు చెప్పారు. ‘ప్రకటనలో పొరపాటు జరిగింది. దాని వెనక ఎలాంటి దురుద్దేశం లేదు. మా మనసుల్లో భారత్ పై ప్రేమ ఉంది’ అని వివరణ ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని